Prone Zones: తెలుగు రాష్ట్రాల్లో ఎండాకాలమో, వర్షాకాలమో చెప్పలేం. అకాల వర్షాల కారణంగా రెండు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఈ అకాల వర్షాల్లే రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. చేతికొచ్చిన పంటలు, ఐకేపీ కేంద్రాలకు తరలించిన వరి ధాన్యం కుప్పలు, కల్లాల్లో ఆరబెట్టిన పంటలన్నీ నీటిపాలైంది. దీంతో రైతులు కన్నీటి పర్వంతమవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కొందరు రైతులు తడిసిన ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబెడుతున్నారు. ధ్యాన్యం ఎండితే కొంత మంచి ధరకైనా పోతుందనే ఆశతో రోడ్లపై ఆరబెట్టి పడిగాపులు కాస్తున్నారు. కాగా.. ఇలా ధాన్యం రోడ్డుపై ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. రోడ్లపై వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
Read also: PM warangal tour: మరోసారి తెలంగాణకు మోడీ.. ఈసారి ఏ జిల్లాలో అంటే..
ఇటీవల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే వాహనదారులు కూడా బీ అలర్ట్ గా ఉండాలని అధికారులు చెబుతున్నారు. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టింటారు కాబట్టి చూసి చూడకుండా వాహనం నడిపితే ప్రమాదాల బారిన పడుతున్నారని వెల్లడించారు. రోడ్లపై ధాన్యం కుప్పలు.. చూసి జాగ్రత్తగా ప్రయాణించాలని కోరుతున్నారు. ఇక తాజాగా ఇలాంటి ఘటనే పెదపడల్లి జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డుపై వరికుప్పలను రైతులు ఆరబోసారు. అయితే లారీ నడుపుతున్న డ్రైవర్ ఆ వరికుప్పలను లైట్ తీసుకున్నాడు. వరి కుప్పలపైనుంచే లారీని నడిపాడు. సుల్తానాబాద్ మండలం కనుకుల దగ్గర కలప లోడుతో వెలుతున్న లారీ రాత్రి ధాన్యం కుప్పను ఢీకొట్టింది. దీంతో లారీ ఇక్క సారిగా బోల్తా పడింది. లారీ క్యాబిన్‌పై నుంచి డ్రైవర్ కిందపడ్డాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fake gang: సైబరాబాద్‌లో కల్తీ ముఠా… కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్