కైకలూరులో క్షుద్ర పూజల కలకలం
ఏలూరు జిల్లా కైకలూరులో క్షుద్ర పూజల కలకలం రేపుతుంది. కైకలూరు మండలం వేమవరం పాడు గ్రామంలో రాత్రి క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హుటాహుటిన పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన చెరువుపై పూజ చేసుకుంటుండగా క్షుద్ర పూజ అనే అనుమానంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. క్షుద్ర పూజ కాదు చెరువుకు చేసే పూజ అని చెరువు యజమాని గ్రామస్తులకు చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. పోలీసలు జోక్యంతో వివాదం కాస్తా పోలీస్ స్టేషన్ కు చేరింది. పూజలు నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
సార్ మిమ్మల్ని ఎవరో మోసం చేశారు…
బాలీవుడ్ లో చాలా కన్సిస్టెంట్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసే హీరో ‘సల్మాన్ ఖాన్’. రిజల్ట్ తో సంబంధం లేకుండా భారి వసూళ్లని రాబట్టడం సల్మాన్ ఖాన్ కి అలవాటైన పని. వీక్ సినిమాతో కూడా వందల కోట్లు రాబట్టల సల్మాన్, ఇక రంజాన్ రోజున తన సినిమాని రిలీజ్ చేశాడు అంటే ఇక బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత దశాబ్దమున్నర కాలంగా రంజాన్ రోజున బాక్సాఫీస్ ని దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతున్న సల్మాన్ ఖాన్, ఈసారి కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ నెగటివ్ టాక్ తెచ్చుకోని నార్త్ ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసింది. సల్మాన్ సినిమా మొదటి రోజు ఇంత వీక్ కలెక్షన్స్ ని రాబట్టింది ఏంటని ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంలో నార్త్ ఆడియన్స్ సల్మాన్ ఖాన్ మోసపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా తమిళ వీరమ్, తెలుగు కాటమరాయుడు సినిమాలకి రీమేక్ గా తెరకెక్కింది. వీరమ్ పదేళ్ల క్రితం సినిమా, ఒక ఫక్తు టెంప్లెట్ తో రూపొందింది అయితే అజిత్ ఫ్యాన్ బేస్ కారణంగా తమిళనాడులో వీరమ్ సినిమా హిట్ అయ్యింది. తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా తెలుగులో యావరేజ్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది కాటమరాయుడు సినిమా ఇక్కడే ఫ్లాప్ అయ్యింది అంటే ఇక హిందీలో అది కూడా పదేళ్ల తర్వాత ఈ సినిమాని రీమేక్ చెయ్యాలి అనే ఆలోచన సల్మాన్ ఖాన్ కి ఎవరు ఇచ్చారో ఏమో కానీ దాని ఫలితమే ఈరోజు బాక్సాఫీస్ రిజల్ట్. పైగా డైరెక్టర్ ఫర్హద్ ఖాతాలో చాలా ఫ్లాప్స్ ఉన్నాయి, అలాంటి దర్శకుడిని నమ్మి సల్మాన్ ఖాన్ ఒక పదేళ్ల క్రితం వచ్చిన ఓ రెగ్యులర్ రొట్ట మాస్ సినిమాని ఎందుకు రీమేక్ చేశాడో భాయ్ కే తెలియాలి.
ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన.. 36 గంటల్లో 5,300 కి.మీ
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఏడు నగరాల మీదుగా 36 గంటల్లో 5,300 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. ఈ క్రమంలోనే ఆయా నగరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూలలో ప్రధాని పర్యటన కొనసాగనుంది. ప్రధాని పర్యటన షెడ్యూల్‌ను శనివారం పీఎంవో అధికారులు విడుదల చేశారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రారంభమై మంగళవారం దమణ్ పర్యటనతో ముగుస్తుంది. తొలుత సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రధాని బయలుదేరుతారు. 500 కిలో మీటర్ల దూరం ప్రయాణించి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహో చేరుకుంటారు. అక్కడి నుంచ రేవాలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఇక్కడ దాదాపు రూ.19 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. తర్వాత మళ్లీ ఖజురహోకు వస్తారు. తరువాత 1,700 కి.మీ ప్రయాణించి కొచ్చిలో జరగనున్న యువమ్ సదస్సుకు హాజరవుతారు.
కేంద్ర, రాష్ట్ర సర్కార్ లపై ఏపీసీసీ చీఫ్ ఫైర్
త నెల రోజులుగా దేశ వ్యాపితంగా జై భారత్ సత్యాగ్రహ సభలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించామని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఆదాని యొక్క అక్రమ ఆస్తులపై పార్లమెంట్ రాహుల్ గాంధీ ప్రసంగాలను లోక్ సభ రికార్డుల నుంచి తొలగించారు.. దేశ సమస్యలపై ప్రసంగాలని తొలగించిన పరిస్థితి చరిత్రలో ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు లేదని ఆయన అన్నారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా రాహుల్ గాంధీ దేశంలోని అనేక సమస్యలపై మాట్లాడుతున్నారు.. అనేక ప్రాంతాల్లో ముస్లింలను కించపరుస్తు దాడులు జరిగాయి.. క్రిస్టియన్ల సంస్థలపై దాడులు జరిగాయి.. అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలతో ధాన్యం ధాన్యం తడిసిపోయింది..మామిడి తోటలు.దెబ్బతిన్నయి.. మొక్క జొన్న చెను నెలకొరిగింది .. కొన్ని చోట్ల ఈదురు గాలులకు ఇంటి పైనా వేసిన రేకుల పై కప్పులు ఎగిరిపోయి. కరెంట్ పోల్స్ క్రింద పడిపోయాయి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతల తో పాటు సామాన్యులను ఇబ్బందుల పాలు చేశాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ, చిన్నగూడూరు, నరసింహులపేట, కురవి, జనగామ జిల్లా బచ్చన్నపేట, రఘునాథప ల్లి, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలాల్లో శు క్రవారం అర్ధరాత్రి, శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వరి, మామిడి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలులకు తోడుగా వడగండ్లు పడడంతో వడ్లు, మామిడికాయలు రాలిపోగా, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు చోట్ల ఇండ్ల పైకప్పు లు కొట్టుకుపోగా, స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
బోయపాటి రేంజ్ దర్శకుడితో విశాల్ సినిమా…
తెలుగులో ఓవర్ ది టాప్ మాస్ కమర్షియల్ సినిమా చెయ్యాలి అంటే అది బోయపాటి శ్రీనుకే సాధ్యం. ఊర మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను సినిమా వస్తుంది అంటే చాలు హీరో ఎవరు అనే విషయాన్ని పక్కన పెట్టి మరీ బీ, సీ సెంటర్ల ఆడియన్స్ థియేటర్స్ కి క్యు కడతారు. తెలుగులో బోయపాటి రేంజ్ కమర్షియల్ సినిమా చేసే దర్శకుడు మరొకరు లేరు కానీ తమిళ్ లో మాత్రం ఒకరు ఉన్నారు. మాస్ సినిమాలని రీడిఫైన్ చేసిన ఆ దర్శకుడి పేరు ‘హరి’. సూర్యతో ఆరు, సింగం, సింగం 2, దేవ సినిమాలు చేసిన హరికి కోలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా పేరుంది. మాస్ సినిమాలని మాత్రమే చేసే ఈ దర్శకుడు, తన నెక్స్ట్ సినిమాని సూర్యతో సింగం 3 తీస్తాడు అనుకుంటే అందరికీ షాక్ ఇస్తూ విశాల్ తో సినిమా అనౌన్స్ చేశాడు. విశాల్ తో ఇప్పటికే భరణి, పూజ సినిమాలు చేశాడు హరి. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు విశాల్ కి మంచి హిట్స్ గా నిలిచాయి.
అందులో పెట్టుబడులు నేను పెట్టలేదు.. నిరూపిస్తే నా ఆస్తి రాసిస్తా
మైత్రీ మూవీస్ లో నేను పెట్టుబడులు పెట్టాననటం అవాస్తవం అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అందరినీ ప్రశ్నిస్తా అంటున్న పవన్ కళ్యాణ్ ను ఒక్కటే ప్రశ్నిస్తున్నా.. పవన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత లందరినీ అడిగి తెలుసుకోండి.. మైత్రీ మూవీస్ లో నేను కానీ, మా కుటుంబ సభ్యులు కానీ పెట్టుబడులు పెట్టామని నిరూపిస్తే మా ఆస్తులు మొత్తం రాసిచ్చి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ చేశారు. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సహకరిస్తే మైత్రీ మూవీస్ లో పెట్టుబడులు పెట్టినట్లా.. వీరసింహారెడ్డి సినిమాకే కాదు ఏ సినిమాకు అయినా అవసరం అయితే సహకరిస్తానంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అతని వల్లే మేము మ్యాచ్ ఓడిపోయాం..
ఐపీఎల్ 2023లో వరుసగా మూడు విజయాలు నమోదు చేసి మంచి జోష్ మీద కనిపించిన ముంబై ఇండియన్స్ జట్టుకు పంజాబ్ కింగ్స్ టీమ్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను 13 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓడించింది. 215 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగదిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఓటమిపై మ్యాచ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. చివరి ఓవర్ లో అర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడని రోహిత్ పేర్కొన్నాడు.
హ్యాపీ బర్త్ డే కెప్టెన్… పాన్ వరల్డ్ సినిమా ఇచ్చేయ్…
నాగ్ అశ్విన్… ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్, రెండో సినిమా మహానటితో ఒక్కసారిగా ప్రతి ఒక్కరినీ తన వైపు చూసేలా చేశాడు. మహానటి సావిత్రి కథతో కీర్తి సురేష్ ని పెట్టి మహానటి సినిమా చేసిన నాగ్ అశ్విన్ సౌత్ ఇండియా హిట్ కొట్టాడు. ఈసారి అంతకు మించి అన్నట్లు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ ‘ప్రాజెక్ట్ K’ సినిమా చేస్తున్నాడు. ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్, ప్రాజెక్ట్ K సినిమాలో హీరో అనగానే అదో సెన్సేషన్ అయ్యింది. ఇప్పటివరకూ చూడని ఒక ఇమేజినరీ వరల్డ్ ని క్రియేట్ చేసి నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ K’ సినిమా చేస్తున్నాడు.
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 22 మందికి గాయాలు..
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె-బెంగళూరు హైవేపై ప్రైవేట్ బస్సును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, 22 మంది గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సతారా నుంచి థానేలోని డోంబివిలీకి వెళ్తున్న ప్రైవేట్ ప్యాసింజర్ బస్సు స్వామినారాయణ దేవాలయం సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీ కొట్టిందని పోలీసులు చెప్పారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అన్నారు. బస్సులో ముగ్గురు ప్రయాణికులు, ట్రక్కు డ్రైవర్ మృతి చెందగా, 22 మంది ప్రయాణికులు గాయపడ్డారని తెలిపారు.
తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడా వడగళ్ల వాన
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అకాల వర్షాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. దీంతో రైతున్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి వచ్చిన వరిపంట నీటిలో కొట్టుకుపోవడంతో.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్‌లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. నిన్న కురిసిన అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. మామిడిచెట్లకు ఉన్న కాయల నేలరాలాయి. దీంతో.. వేలాది ఎకరాల్లో వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. వరుసగా వడగండ్ల వర్షం ఈదురుగాలులతో మామిడి పూర్తిగా నేలరాలింది.