JNUSU: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (JNUSU) ఎన్నికల్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), మరియు డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫ్రంట్ (DSF) ల సంకీర్ణమైన లెఫ్ట్ యూనిటీ అలయన్స్ అఖండ విజయం సాధించింది. నాలుగు సెంట్రల్ ప్యానెల్ పదవుల్ని కైవసం చేసుకుంది. క్యాంపస్‌లో పూర్తి ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.
HCU: ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి సంఘం అయిన ‘‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP)’’ జయకేతనం ఎగరేసింది. ఏబీవీపీ-ఎస్ఎల్వీడీ కూటమి అన్ని సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్ని కైవసం చేసుకుంది. కూటమికి చెందిన శివ పాలెపు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏబీవీపీ కూటమికి చెందిన శ్రుతి ప్రియ ప్రధాన కార్యదర్శి, సౌరభ్ శుక్లా సంయుక్త కార్యదర్శి పదవుల్ని గెలుచుకున్నారు.
దేశంలోనే కీలకమైన ఢిల్లీ విశ్వవిద్యాలయానికి స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇపుడు అన్ని విద్యాసంస్థల్లో, రాజకీయ పార్టీల్లో డియూ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలపై ఆసక్తికర చర్చ ప్రారంభమైంది.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించేందుకు. విద్యార్థి సంఘం లేదా స్టూడెంట్ కౌన్సిల్ పేరుతో విద్యార్థుల ఎన్నికల ప్రక్రియను ప్రోత్సహిస్తున్నాయి. భారత దేశంలోనూ జాతీయ విశ్వవిద్యాలయాలు, కొన్ని రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు విద్యార్థి సంఘ ఎన్నికలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నాయి. 1922లో…
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యం కేసు ముగిసింది. ఈ కేసును కోజ్ చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ ముగింపు నివేదికను కోర్టు అంగీకరించింది. నజీబ్ అహ్మద్ అక్టోబర్ 15, 2016 నుంచి కనిపించకుండా పోయాడు. 2018లో సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. సీబీఐ నివేదికలో నజీబ్ మిస్సింగ్‌పై ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు కనుగొనబడలేదని సీబీఐ పేర్కొంది.…
హెచ్సీయూ భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు బయల్దేరారు. భూముల వద్ద వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు యత్నించారు.. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి హౌజ్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, దన్ పాల్ సూర్యనారాయణ గుప్త, బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు…
హెచ్సీయూ భూముల వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.. ఇవాళ తరగతుల బహిష్కరణకు ఏబీవీపీ పిలుపునిచ్చింది.. నిరసనలు ఉద్ధృతం చేయాలని ఏబీవీపీ నిర్ణయం తీసుకుంది.. ఉదయం 10.30 కు హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేసేందుకు ఏబీవీపీ యత్నిస్తోంది. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల బృందం ఈ రోజు వర్సీటీకి వెళ్లనున్నారు. బీజేపీ హెచ్సీయూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తోంది. 400 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. హెచ్సీయూ మెయిన్ గేట్ దగ్గర ధర్నాకు సీపీఎం పిలుపునిచ్చింది.…
ట్రిపుల్ ఐటీ ముట్టడికి వెళ్తున్న ఏబీవీపీ నాయకులు అరెస్ట్‌లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్పందిస్తూ.. ఏబీవీపీ నాయకులపై పోలీసుల, బాసర ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమన్నారు.
Hyderabad: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు ఏబీవీపీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వివాదం చెలరేగినట్లు తెలుస్తుంది.
Ramleela play: రామయాణం ఇతిహాసం ఆధారంగా నాటకాన్ని ప్రదర్శిస్తూ.. అందులో పవిత్ర దేవీదేవతలను కించపరుస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు పూణే యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్, ఐదుగురు విద్యార్థులను శనివారం అరెస్ట్ చేశారు. నాటకంలో అసభ్యకరమైన సీన్లు, డైలాగ్స్ ఉన్నాయని, ఇందులో సీతాదేవీ పాత్రధారి సిగరేట్ తాగుతున్నట్లు చూపించారని ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీ కార్యకర్త హర్షవర్థన్ హర్పుడే ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 (A) మరియు ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం…
ABVP: హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ ప్రేమావతిపేట సమీపంలో భూమిని మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి రేవంత్ ప్రభుత్వం జీవో 55ని..