Bhajan Lal Sharma: రాజకీయ హేమాహేమీలు, దిగ్గజాలు ఉన్నా కూడా వారందరిని పక్కన పెట్టి అనూహ్యమైన వ్యక్తిని రాజస్థాన్ సీఎంగా ప్రకటించింది బీజేపీ. మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్ వంటి వ్యక్తులను పక్కనపెడుతూ.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌లాల్ శర్మకు రాజస్థాన్ అధికార పగ్గాలు అప్పగించింది. ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాగే విష్ణుదేవ్ సాయ్, మోహన్ యాదవ్‌లను సీఎంలుగా ప్రకటించిన సర్‌ప్రైజ్ చేసిన బీజేపీ, రాజస్థాన్ సీఎం అభ్యర్థి…
అమరావతిలోని ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టులో ఏబీవీపీ అమృతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏబీవీపీలో పని చేసిన ప్రస్తుత, పూర్వ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. దేశంలో ఏబీవీపీ విస్తరిస్తోందని అన్నారు. గౌహతిలో జరిగిన తొలి జాతీయ మహా సభకు హజరయ్యానని తెలిపారు.
JNU: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఈ యూనివర్సిటీ కేంద్రంగా నిలిచిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణకు కేంద్ర బింధువుగా ఉంది.
Delhi University elections: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి విభాగమైన ‘అఖిల భారీతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)’ సత్తా చాటాంది. కీలక స్థానాలను గెలుచుకుంది. శనివారం సాయంత్రం ఓట్ల లెక్కింపు ముగియగా.. నాలుగు సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్లో మూడింటిని ఏబీవీపీ కైవసం చేసుకుంది. కేవలం ఒక సీటును ఎన్ఎస్‌యూఐ గెలుచుకుంది. అధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ పోస్టులను ఏబీవీపీ కైవసం చేసుకుంది.
Sangareddy: సంగారెడ్డిలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. SFI, ABVP విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నేడు SFI రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఉండటంతో SFI కార్యకర్తలు జెండాలు కడుతున్నారు.
విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాలు పనిచేస్తాయి. ఇది సర్వసాధారణం. విద్యార్థుల సమస్యలపై మిలిటెంట్ పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. విద్యార్థుల పోరాటాలతో ప్రభుత్వాలు కూలిన సందర్భాలు ఇండియాలో ఉన్నాయి.
TS Schools: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాఠశాలల బంద్‌కు అఖిల భారత విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.
TS University: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీసీ), పాలక మండలి (ఈసీ) మధ్య విభేదాల కారణంగా రిజిస్ట్రార్ నియామకంపై వివాదం రగులుతుంది. మంగళవారం వర్సిటీకి వీసీ రాకతో స్టాఫ్ రిజిస్ట్రార్ ఛాంబర్ తెరిచినా ఆ స్థానంలో ఎవరూ కూర్చోలేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌కు నిరసనగా ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.