ఢిల్లీ కేంద్రంగా బీజేపీ-ఆప్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరు పార్టీలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నాయి. ‘ఆపరేషన్ లోటస్-2.0’ అంటూ ఆప్ చేసిన ఆరోపణలపై బీజేపీ తాజాగా కౌంటర్ ఇచ్చింది.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు అందించింది. ఇటీవల కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో క్రైమ్ బ్రాంచ్ యూనిట్ శుక్రవారం నేరుగా కేజ్రీవాల్ ఇంటికి వెళ్లింది. అయితే, క్రైమ్ బ్రాంచ్ అధికారులు నోటీసులు ఇవ్వకుండానే వెనుదిరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని
Arvind Kejriwal: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు ఆప్ నిరసనకు పిలుపునిచ్చింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ చేసి గెలుపొందిందని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ స్థాయికైనా వెళ్లొచ్చని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చంఢీగఢ్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. తొలిపోరులోనే కూటమి చతికిలపడింది. కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కలిసి తొలిసారి చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ కూటమికే ఎక్కువ కార్పొరేటర్లు ఉన్నారు. అయినా కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అనూహ్యంగా బీజేపీకి చెందిన మనోజ్ సొంకార్ మేయర్‌గా విజయం సాధించారు.
INDIA bloc: కాంగ్రెస్ పార్టీకి వరస షాకులు తగులుతున్నాయి. అదికార బీజేపీని, ప్రధాని మోడీని గద్దె దింపుతామంటున్న ఇండియా బ్లాక్‌లో లుకలుకలు కనిపిస్తున్నాయి. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తాము బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది.
Ram Mandir Event: జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని మంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ వేడుకలో రామ్ లల్లా(బాల రాముడి) ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ప్రధానితో పాటు దేశ వ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు, సాధువులతో సహా 7000 మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఇటీవల నాలుగోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. జవవరి 18న తమ ముందు హాజరుకావాలని కోరింది. అయితే మరోసారి కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు ఇలాగే ఈడీ సమన్లను కేజ్రీవాల్ దాటవేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ విద్యాశాఖ కార్యక్రమంలో పాల్గొన్న వెంటనే కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి గోవాకి మూడు…
Chandigarh Mayor Polls: బీజేపీ, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య తొలిపోరుగా భావిస్తున్న చండీగఢ్ మేయర్ ఎలక్షన్ ఈ రోజు జరగబోతోంది. మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు నేడు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గత 8 ఏళ్లుగా బీజేపీ చేతలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్, ఆప్ చేతులు కలిపాయి. దీంతో ఈ ఎన్నికల ప్రాధాన్యత సంతరించుకుంది. 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీకి 14 మంది…
పంజాబ్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి విజయం నమోదు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన తర్వాత పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తుపై సందేహం నెలకొంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ప్రతిపాదనను కాంగ్రెస్ రాష్ట్ర విభాగం నిరంతరం వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో.. పంజాబ్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఆప్‌తో…
Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్‌పై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ‘‘ఆర్ఎస్ఎస్కి చోటా రీఛార్జ్’’ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఢిల్లీలో సుందరాకాండ పారాయణం చేయాలని ఆప్ నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై ఓవైసీ విమర్శించారు.