INDIA bloc: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్-ఆప్ మధ్య పొత్తుల పంచాయతీ కొలిక్కి రావడం లేదు. సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీల మధ్య వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే ప్రతిపక్ష ఇండియా కూటమిలో విబేధాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇటీవల బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇవ్వమని స్పష్టంగా చెప్పింది. మరోవైపు ఆప్ కూడా అదే దారిలో వెళ్తోంది.
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు అయోధ్య వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన రామ మందిరాన్ని సందర్శించనున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన భార్య, తల్లిదండ్రులు అయోధ్య రాముడిని దర్శించుకోనున్నారు. కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా అయోధ్య యాత్రకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
INDIA bloc: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ తీరుపై గుర్రుగా ఉంది. బెంగాల్‌లో పొత్తు ఉండదని ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ప్రకటించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ (Sanjay Singh)కు మళ్లీ నిరాశ ఎదురైంది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తమ ముందు విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్‌కి ఇప్పటికీ 5 సార్లు సమన్లు పంపింది, అయితే వీటన్నింటికి కూడా కేజ్రీవాల్ హాజరుకాలేదు. దీంతో ఈడీ ఢిల్లీ రోస్ ఎవెన్యూకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా కోర్టు ఈరోజు.. సీఎం కేజ్రీవాల్ ఈడీ 5 సమన్లను ఎందుకు దాటవేశారనే దానిపై ఫిబ్రవరి…
ఇండియా కూటమి ఈ మధ్య ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమిలో ఉంటూనే ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ లుకలుకలు వినపడ్డాయి. ఇంకోవైపు ఎవరికి వారే సీట్లు ప్రకటించేసుకుంటున్నారు.
చండీగఢ్ ఉదంతంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme court) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారంటూ రిట్నరింగ్ అధికారిని ఉద్దేశిస్తూ ధర్మాసనం సంచలన వ్యా్ఖ్యలు చేసింది.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఏదైనా చేయొచ్చని. తిమ్మిని బమ్మిని చేసి అడ్డదారుల్లో వెళ్లే ఆఫీసర్స్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి చేసిన పనికి సుప్రీంకోర్టు (Supreme Court) గట్టిగానే చీవాట్లు పెట్టింది.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని బలవంతం చేస్తు్న్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయినా కూడా తాను ఒత్తిళ్లకు లొంగబోనని తేల్చి చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ కేసును ఢిల్లీ క్రైం బ్రాంచ్ విచారిస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్‌కి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విచారణ మధ్యే కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేయడం…