దేశ రాజధాని ఢిల్లీ ఆప్‌కు (AAP) బీజేపీకి (BJP) ఎంతో కీలకమైంది. ఇక్కడ మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నీ ప్రస్తుతం కమలం చేతిలోనే ఉన్నాయి.
త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు రాలేని చెప్పారు. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్లకు ఇవాళ ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా.. తాను హాజరుకావడం లేదని సీఎం చెప్పారు.
చండీగఢ్ మేయర్ ఎన్నికపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమారే మేయర్‌గా ప్రకటించింది.
చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం షాకిచ్చింది. మేయర్ ఎన్నిక (Chandigarh Mayoral Polls) సందర్భంగా బ్యాలెట్ పత్రాలను తారుమారు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
చండీగఢ్ రిటర్నింగ్ అధికారిపై (Chandigarh Poll Officer) సుప్రీంకోర్టు సీరియస్ (Supreme Court) అయింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Arvind Kejriwal: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లకు హాజరుకాలేదు. ఈడీ సమన్లను దాటవేయడం ఇది ఆరోసారి. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని.. ఈ విషయం ప్రస్తుతం కోర్టులో ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది. ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో.. ఈడీ స్వయంగా కోర్టును ఆశ్రయించిందని.. పదేపదే సమన్లు జారీ చేసే బదులు, ఈ అంశంపై కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని సూచించింది.
Chandigarh Mayor Row: చండీగఢ్ మేయర్ పోల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాని ప్రయత్నించింది. అయితే, అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ అభ్యర్థి చండీగఢ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకి ఎక్కింది. ఈ రోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో, విచారణకు ముందే మేయర్ అభ్యర్థి, బీజేపీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం రాజీనామా చేశారు.