ఇండియా కూటమి ఈ మధ్య ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమిలో ఉంటూనే ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ లుకలుకలు వినపడ్డాయి. ఇంకోవైపు ఎవరికి వారే సీట్లు ప్రకటించేసుకుంటున్నారు. దీంతో ఇండిమా కూటమి చీలిపోతుందంటూ వార్తలు వినిపించాయి. కానీ వీటిన్నంటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ ఇండియా కూటమి (INDIA bloc) సరికొత్త నిర్ణయానికి తీసుకుంది.
ఫిబ్రవరి చివరిలో ముంబైలో (Mumbai) పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టేందుకు ఇండియా కూటమి సిద్ధపడుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష బలాన్ని.. తమ ఐక్యతను చాటిచెప్పేందుకు కూటమి ఉమ్మడి ర్యాలీకి ప్రణాళికలు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పువ్వు పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ రెడీ అవుతోంది.
ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో ఉన్న జేడీయూ ఇప్పటికే బయటకు వెళ్లిపోయింది. బీజేపీతో జత కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇంకోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ… కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ అభ్యర్థులను ప్రకటించేశారు. ఇలా ఎవరికి వారే సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలో చేపట్టబోయే భారీ ర్యాలీలో ఎవరెవరు పాల్గొంటారనేది సందిగ్ధం నెలకొంది. ఇకపోతే సార్వత్రిక ఎన్నికలకు సమయం ఇంకా ఎంతో లేదు. ఆ టైమ్‌కి కూటమి పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి.