ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాస్తవానికి సోమవారమే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. భారీ ర్యాలీగా వెళ్లడంతో సమయం దాటిపోయింది.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాలు విసిరారు. ముఖ్యంగా ఢిల్లీలోని మురికివాడల విషయంలో అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. మురికివాడలను కూల్చివేసిన వారికి అదే స్థలంలో ఇళ్లు ఇప్పించి, వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటే నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన అన్నారు. అలాగే డిసెంబర్ 27న షకూర్ బస్తీ రైల్వే కాలనీ సమీపంలోని మురికివాడల భూ వినియోగాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మార్చారని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో…
ఢిల్లీ ఆప్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఫిబ్రవరి 5న ఆప్ విపత్తు పోతుందని జోస్యం చెప్పారు. శనివారం జేఎల్‌ఎన్ స్టేడియంలో జరిగిన ‘‘జుగ్గి బస్తీ ప్రధాన్ సమ్మేళన్’’ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని కేజ్రీవాల్ లక్ష్యంగా ధ్వజమెత్తారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని్కల్లో అధికార పార్టీ ఆప్-బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీల మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ఇక బీజేపీ అయితే కేజ్రీవాల్ టార్గెట్‌గా దాడి చేస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో 29 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. నిన్న అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడానికి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు లిక్కర్ పాలసీ వ్యవహారం తాజాగా మరోసారి కాక రేపుతోంది. మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా కాగ్ పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
INDIA alliance: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమిలో విభజనకు దారి తీసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన విపక్షాలు, బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా నిలువరించాయి, కానీ అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోలేదు. 400 సీట్లు అంటూ బీజేపీ పెట్టుకున్న లక్ష్యాన్ని, కేవలం 240 సీట్లకు మాత్రమే పరిమితం చేయగలిగింది ఇండియా కూటమి.
2024 లోక్‌సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు తేజస్వీ ఈ విధంగా స్పందించారు.
End India bloc: ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపక్షాల మధ్య ఐక్యతను ఆయన ప్రశ్నించారు. కలసికట్టుగా ఉండకపోతే కూటమికి ముగింపు పలకాలన్నారు.
AAP vs BJP: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఆప్, బీజేపీ పరస్పర విమర్శలకు దిగాయి. ఈ సమయంలో ‘ ముఖ్యమంత్రి బంగ్లా’ వివాదం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ బంగ్లాను ‘శీష్ మహల్ అంటూ భారతీయ జనతా పార్టీ చేస్తోన్న విమర్శలను ఆమ్ ఆద్మీ పార్టీ తిప్పికొడుతుంది.