భారత టెలికాం రంగంలో నూతన శకం ప్రారంభమైంది. దేశంలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ... దీంతో పాటు 5జీ సేవలకు కూడా శ్రీకారం చుట్టారు.
Mukesh Ambani statement on Jio 5G: హైస్పీడ్ 5జీ స్పెక్ట్రం సర్వీసులను ఈ ఏడాది దీపావళి నాటికి అందుబాటులోకి తేనున్నట్లు రిలయెన్స్ జియో సంస్థ ప్రకటించింది. తొలుత ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయెన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ఆన్‌లైన్‌లో జరిగిన సంస్థ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఆయన కంపెనీ షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
అక్టోబరు 12 నాటికి 5జీ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్... మేం 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం, టెలికాం ఆపరేటర్లు దీనిపైనే పని చేస్తున్నారు, ఇన్‌స్టాలేషన్‌లు జరుగుతున్నాయని వెల్లడించారు.
దేశంలో ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా 5జీ టెలికాం సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు 2022, ఆగస్టు 15 కల్లా 5జీ సేవలు ప్రారంభమయ్యేలా చూడాలని ప్రధానమంత్రి కార్యాలయం టెలికాం శాఖను ఆదేశించింది. దీంతో 5జీ స్పెక్ట్రానికి సంబంధించిన సిఫార్సులను మార్చికల్లా అందించాలని టెలికాం శాఖ ట్రాయ్‌ను కోరింది. వివిధ బ్యాండ్‌లలో లభ్యమయ్యే స్పెక్ట్రంను వేలం వేసేందుకు ధరలు, పరిమాణం, ఇతర షరతులకు సంబంధించిన సిఫార్సులను ట్రాయ్ చేయనుంది. అటు అల్ట్రా హైస్పీడ్…
అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం దిగ్గజ సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. అమెరికా నుంచి వెళ్లాల్సిన లేదా రావాల్సిన 538 విమానాలు 5జీ సేవల ప్రారంభం వల్ల రద్దు కానున్నాయని తెలుస్తోంది. రద్దయిన విమాన సర్వీసులలో ఎమిరేట్స్, ఎయిరిండియా, ఏఎన్ఏ, జపాన్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించినవి ఉన్నాయి. 5జీ సర్వీసుల్లో ఉపయోగించే ఫ్రీక్వెన్సీ విమానాల్లోని…