అక్టోబరు 12 నాటికి 5జీ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్… మేం 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం, టెలికాం ఆపరేటర్లు దీనిపైనే పని చేస్తున్నారు, ఇన్‌స్టాలేషన్‌లు జరుగుతున్నాయి. మొత్తానికి అక్టోబర్ 12 నాటికి 5జీ సేవలను ప్రారంభిస్తాం.. ఆ తర్వాత నగరాలు, పట్టణాలకు విస్తరిస్తామని వెల్లడించారు.. రాబోయే రెండు, మూడేళ్లలో దేశంలోని ప్రతి ప్రాంతానికీ 5జీ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇది సరసమైనదిగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాం.. ఈ పరిశ్రమల.. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారిస్తుందన్నారు..
Read Also: NSG IG in TDP Office: టీడీపీ ఆఫీస్‌కు ఎన్‌ఎస్‌జీ ఐజీ.. విషయం ఇదే..!
టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DoT) సర్వీస్ ప్రొవైడర్లు.. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, అదానీ డేటా నెట్‌వర్క్స్ మరియు వొడాఫోన్ ఐడియా నుండి ఇటీవల వేలంలో దక్కించుకున్న స్పెక్ట్రమ్ కోసం సుమారు 17,876 కోట్ల రూపాయలను అందుకుంది.. రిలయన్స్ జియో, అదానీ డేటా నెట్‌వర్క్స్ మరియు వొడాఫోన్ ఐడియా 20 సమాన వార్షిక వాయిదాలను చేయడానికి ఎంచుకున్నప్పటికీ, భారతీ ఎయిర్‌టెల్ మాత్రమే ఎక్కువ ముందస్తు మొత్తాన్ని చెల్లించింది. ఎయిర్‌టెల్ రూ. 8,312.4 కోట్లు చెల్లించింది, నాలుగు సంవత్సరాల ముందస్తు వాయిదాలను క్లియర్ చేసింది. ఇక, 5జీ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన అతిపెద్ద సంస్థగా అవతరించింది ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో.. మొదటి విడతగా రూ.7,864 కోట్లు చెల్లించింది. వొడాఫోన్ ఐడియా రూ.1,680 కోట్లు చెల్లించగా, తాజాగా టెలికం రంగంలో అడుగుపెట్టిన అదానీ డేటా నెట్‌వర్క్ తొలి విడతగా రూ.18.94 కోట్లు చెల్లించింది. దేశంలోనే అతిపెద్ద టెలికాం స్పెక్ట్రమ్ వేలం రికార్డు స్థాయిలో రూ. 1.5 లక్షల కోట్ల విలువైన బిడ్‌లను అందుకుంది, ముఖేష్ అంబానీ యొక్క జియో రూ. 87,946.93 కోట్ల బిడ్‌తో విక్రయించబడిన అన్ని ఎయిర్‌వేవ్‌లలో దాదాపు సగం కార్నర్ చేసింది. స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖల జారీ తర్వాత, 5జీ లాంచ్ కోసం సన్నద్ధం కావాలని వైష్ణవ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను గతంలో కోరారు. మొదటిగా, రేడియో తరంగాల విజయవంతమైన బిడ్డర్లు ముందస్తు చెల్లింపులు చేసిన అదే రోజున DoT స్పెక్ట్రమ్ అసైన్‌మెంట్ లేఖలను జారీ చేసింది. 5జీ స్పెక్ట్రమ్ అసైన్‌మెంట్ లెటర్ జారీ చేయబడింది. 5జీ లాంచ్ కోసం సిద్ధం కావాలని టీఎస్‌పీలను అభ్యర్థిస్తున్నాను అంటూ వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో రాసుకొచ్చారు.