ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. క్యాంపు కార్యాలయంకు చేరుకున్నారు సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులు. ఆయా జిల్లాల్లో నూతన కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు స్వీకరించారు. నూతన జిల్లాల ఆవిష్కరణ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఏపీలో ఇవాళ్టి నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కానున్నాయి. గతంలో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. తాజాగా 26 జిల్లాలకు పెరగనుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి అఖిలపక్షాలను ఆహ్వానించకపోవడం దుర్మార్గం అని దుయ్యబట్టారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. జిల్లాల ఏర్పాటు అన్ని రాజకీయ పక్షాలకు ఆమోదయోగ్యమైనా సీఎం ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో హేతుబద్ధమైన సూచనలను కూడా బేఖాతరు చేయడం…
* ఇవాళ ఉదయం 9.05 – 9.45 నిమిషాలకు క్యాంప్ కార్యాలయం నుంచి 26 జిల్లాలను వర్చువల్‌గా లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్. *మారనున్న ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం. 26 జిల్లాల రాష్ట్రంగా కొత్త రూపు. 42 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు. చివరిసారిగా 1979లో ఏర్పడిన విజయనగరం జిల్లా. *నేడు కోనసీమ జిల్లా వ్యాప్తంగా బ్లాక్ డే. అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును…
ఏపీలో జిల్లాల స్వరూపం మారిపోతోంది. మరికొద్ది గంటల్లో కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. కొత్త జిల్లాలకు సంబంధించిన వివరాలను ఎన్టీవీతో ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ పంచుకున్నారు. మంటేడ మండలాన్ని పార్వతీపురం నుంచి విజయనగరం జిల్లాలోకి మార్చాం. పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి మండలాన్ని విశాఖలో ఉంచాం అన్నారు. మిగిలిన నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో మండలాల మార్పు చేశాం. మొత్తం మీద 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు…
ఆంధ్రప్రదేశ్ స్వరూపం మారింది. పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన పూర్తయింది. ఇప్పుడున్న 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. అలాగే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో డివిజన్ల సంఖ్య 51 నుంచి 72కు చేరింది. ఈ మేరకు శనివారం తుది గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. 17,500కు పైగా సూచనల పరిశీలన అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తిచేసింది. జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. కొన్ని జిల్లాల్లో…
ఏపీలో మళ్ళీ మూడురాజధానుల అంశం తెరమీదకు వచ్చింది. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్నికల హామీకి అనుగుణంగా రాష్ట్రంలో 26జిల్లాలు ఏవిధంగా వచ్చాయో….మూడు రాజధానులు అదే విధంగా వస్తాయన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అవ్వడం ఖాయం అని ధీమాగా చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు ఊహలు, అయోమయంలో ఉంటారని ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాలకు టీడీపీ అనుకులమో…!? వ్యతిరేకమో చెప్పాలన్నారు. చారిత్రాత్మక నిర్ణయానికి తగ్గట్టుగానే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం. సీఎంకు గిరిజనులపై…
ఏపీలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తుండటంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాల్లో జనాభా పరంగా 23.66 లక్షల జనాభాతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో నిలవనుంది. ఈ జాబితాలో పాడేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న అల్లూరి సీతారామరాజు జిల్లా 9.54 లక్షల జనాభాతో చివరి స్థానంలో నిలవనుంది. జిల్లాలు-జనాభా: శ్రీకాకుళం జిల్లా (21.91 లక్షలు), విజయనగరం జిల్లా (18.84 లక్షలు),…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోందా? ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్నారు సీఎం జగన్. కొత్త జిల్లాల ఏర్పాటు పై ఫోకస్ చేసిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ఒకటిరెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం. ప్రతి లోక్‌సభ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన వైసీపీ హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసిన…