ఏపీలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తుండటంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాల్లో జనాభా పరంగా 23.66 లక్షల జనాభాతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో నిలవనుంది. ఈ జాబితాలో పాడేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న అల్లూరి సీతారామరాజు జిల్లా 9.54 లక్షల జనాభాతో చివరి స్థానంలో నిలవనుంది.
జిల్లాలు-జనాభా: శ్రీకాకుళం జిల్లా (21.91 లక్షలు), విజయనగరం జిల్లా (18.84 లక్షలు), మన్యం జిల్లా (9.72 లక్షలు), అల్లూరి సీతారామరాజు జిల్లా (9.54 లక్షలు), విశాఖ జిల్లా (18.13 లక్షలు), అనకాపల్లి జిల్లా (18.73 లక్షలు), తూర్పుగోదావరి జిల్లా (19.37 లక్షలు), కోనసీమ జిల్లా (18.73 లక్షలు), రాజమండ్రి జిల్లా (19.03 లక్షలు), నరసాపురం జిల్లా (17.8 లక్షలు), పశ్చిమ గోదావరి జిల్లా (20.03 లక్షలు), కృష్ణా జిల్లా (17.35 లక్షలు), ఎన్టీఆర్ జిల్లా (22.19 లక్షలు), గుంటూరు జిల్లా (20.91 లక్షలు), బాపట్ల జిల్లా (15.87 లక్షలు), పల్నాడు జిల్లా (20.42 లక్షలు), ప్రకాశం జిల్లా (22.88 లక్షలు), నెల్లూరు (23.37 లక్షలు), కర్నూలు (23.66 లక్షలు), నంద్యాల జిల్లా (16.87 లక్షలు), అనంతపురం (23.59 లక్షలు), సత్యసాయి జిల్లా (17.22 లక్షలు), వైఎస్ఆర్ కడప జిల్లా (19.9 లక్షలు), అన్నమయ్య జిల్లా (17.68 లక్షలు), చిత్తూరు జిల్లా (19.85 లక్షలు), శ్రీ బాలాజీ జిల్లా (22.18 లక్షలు)