జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కలిసే వస్తామని ఆయన ప్రకటించారు. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని, వైసీపీ అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Early Elections: కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడంతో ఒక్కసారి జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలపై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా విపక్షాలు ఇండియా కూటమిలోని పార్టీలు కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని అంచనా వేస్తున్నాయి. సీఎంలు నితీష్ కుమార్, మమతా బెనర్జీ వంటి వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విపక్ష నేతల తొలి రోజు సమావేశం ముగిసింది. వివిధ అంశాలపై దాదాపు రెండు గంటలకు పైగా నేతలందరూ చర్చించారు. రేపు (మంగళవారం) మరోసారి భేటీ కానున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని నిలువరించే అంశాలతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించారు.
రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరుగునుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఈ సమావేశానికి 38 పార్టీలు హాజరవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ తొమ్మిది సంవత్సరాలలో ఎన్డీయే గ్రాఫ్ బాగా పెరిగిందని తెలిపాడు. దేశంలో మంచి పాలన, దేశాభివృద్ధి ఎన్డీయేతోనే సాధ్యం అయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బలమైన నాయకత్వంలో 9 ఏళ్లలో దేశాభివృద్ధిని అందరూ చూస్తున్నారు.
దేశానికి ప్రధాన మంత్రి ఎవరైనా సరే, వాళ్లు కచ్చితంగా భార్యతో ఉండాలని రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ షరతు పెట్టారు. అయితే ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశించి అన్నారా లేదంటే రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.
S Jaishankar: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శలు గుప్పించారు. విదేశాల్లో భారత్ ను విమర్శించడం రాహుల్ గాంధీకి అలవాటే అంటూ.. జాతీయ రాజకీయాలను విదేశాల్లో చర్చించడం శ్రేయస్కరం కాదని జైశంకర్ అన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యుల చేశారు. దీనిపై మీడియా జైశంకర్ ని ప్రశ్నించగా…