అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించునున్నారు. షెడ్యూల్ ప్రకారం.. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10:45 గంటలకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోనున్న సీఎం.. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
వాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డాం.... మనం పవర్‌లోకి వచ్చాకా... ఇబ్బందులు పడుతున్నాం. ఇక బతుకంతా ఇంతేనా? కొట్లాడుతూనే ఉండాల్నా? ఇంకెన్నాళ్ళిలా పోరాటం.... అంటూ తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. ఏదేమైనా సరే... వెనక్కి తగ్గేదే లేదు. ప్రైవేట్ కేసులు వేసైనా సరే... నేను అనుకున్నది సాధిస్తానంటున్న ఆ లీడర్ ఎవరు? ఆయన అసహనానికి కారణం ఏంటి?
రాజ్యాంగంపై చర్చకు బీజేపీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. లోక్‌సభలో జరిగే ఈ చర్చలో ప్రధాని మోదీ కూడా పాల్గొని సమాధానం ఇవ్వనున్నారు. డిసెంబర్ 13-14 తేదీల్లో లోక్‌సభలో, డిసెంబర్ 16-17 తేదీల్లో రాజ్యసభలో ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగం పట్ల తమకున్న నిబద్ధతను ప్రదర్శించి ప్రతిపక్షాలపై దాడి చేయడమే బీజేపీ లక్ష్యం
టీడీపీ రాజ్యసభ సభ్యులను ఖరారు చేసింది. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేసింది. ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా మరోసారి ఆధిక్యం చాటుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 290 + స్థానాల్లో ముందంజలో ఉంది. ఇకపోతే గడిచిన 2019 ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించగా.. అప్పటి ఎన్నికలతో పోల్చితే బీజేపీ 57 స్థానాలు తక్కువగా నెంబర్ తో కొనసాగుతుంది. ఇక మరోవైపు చెప్పుకోవాలిసినది కాంగ్రెస్ ఘననీయంగా పుంజుకుంది. దేశవ్యపథంగా వివిధ పార్టీలతో కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలలో ఇప్పటి వరకు 100 స్థానాల…
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్‌తో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఓటింగ్ హక్కుల వినియోగంపై సమాచారాన్ని ప్రచారం చేయడం కొనసాగిస్తున్నాయి. దానితో, రైడ్-షేరింగ్ యాప్ ‘రాపిడో’ రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఓటర్లను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని ప్రకటించారు. మే 13న ఎన్నికల రోజున హైదరాబాద్‌తో సహా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. తెలంగాణలోని 17…