Amit Shah: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ ఇతర విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. గౌహతిలో ఓ కార్యక్రమానికి హాజరైన షా కీలక వ్యాఖ్యలు చేశారు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ గెలుపుపై బీజేపీయేతర విపక్షాలు అభినందనలు తెలియజేస్తున్నారు. కొందరు విపక్షాల ఐక్యతకు ఇదే మంచి సమయం అని చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా అందులో చేరాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం ఈ విషయం దేశంపై ప్రభావం చూపించదని.. 2024 లోక్ సభ ఎన్నికలపై దీని ఎఫెక్ట్ ఉండదని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు.
Badruddin Ajmal: కర్ణాటకలో బీజేపీ పరాజయంతో 2024 ఎన్నికల్లో విపక్షాల కూటమి అనేది చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని ఓడించాలంటే విపక్షాల ఐక్యత ముఖ్యమని భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే అస్సాంకు చెందిన వివాదాస్పద నేత, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్, విపక్ష కూటమి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడేందుకు విపక్ష కూటమిలో చేరాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలకు ఏకం కావాలని పిలుపునిచ్చారు. తన ఫేస్ బుక్ పేజీలో ప్రధాని నరేంద్రమోడీ ‘మన్ కీ బాత్’ ప్రోగాం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఏకం కావాలని అన్ని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సారి అందరూ కలిసి బీజేపీని ఓడించగలరని ఆమె అన్నారు.
2024 Lok Sabha elections: 2024 లోకసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహకాలను ప్రారంభించింది. ఎలక్షన్ కమిషన్(ఈసీ) కొత్తగా 8.92 లక్షల కొత్త వీవీపాట్ మెషీన్‌లకు ఆర్డర్ చేసింది. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) మరియు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు (EVMలు) తప్పుగా ఉన్నాయనే ఆందోళనలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
Amit Shah: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 300కు పైగా లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అస్సాం దిబ్రూఘర్ లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్ సభ స్థానాలకు గానూ 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు.