Yashasvi Jaiswal: రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్ ఎవరు? అనే అంశం ఇప్పుడు భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలోనే రోహిత్ రిటైర్మెంట్‌పై చర్చ జరిగింది. అయితే, ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన హిట్‌మ్యాన్.. బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో టెస్టుల నుంచి కూడా తప్పుకోనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. కానీ మరి కొంత కాలం సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే వరకు రోహిత్ టెస్టు జట్టులో కొనసాగుతానని తెలిపాడు.
Read Also: Liquor Prices: పండుగ పూట మందుబాబులకు గుడ్ న్యూస్..
అయితే, రోహిత్ శర్మ వారసుడిగా జస్‌ప్రీత్ బుమ్రా పేరు ముందు వరుసలో ఉంది. ఇక, బుమ్రా ఫిట్‌నెస్ మీద అనేక సందేహాలు ఉన్నాయి. టెస్టు కెరీర్‌ను ఎన్నాళ్లు పొడిగించుకోగలడనే ప్రశ్నలు వస్తున్నాయి. అతడ్ని కెప్టెన్‌ను చేసే విషయంలో సెలక్టర్లు, కోచ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ల పేర్లు తెర మీదకి వచ్చినట్లు సమాచారం. నిలకడగా రాణిస్తూ టెస్టు జట్టులో సుస్థిర స్థానం దిశగా అడుగులు వేస్తున్న జైస్వాల్‌ను జట్టు సారథిగా నియమిస్తే బాగుంటుందని హెడ్ కోచ్ గంభీర్ ప్రతిపాధించాట.
Read Also:
ఇక, యశస్వీ జైస్వాల్ శ్రద్ధగా ఆట మీద దృష్టి పెట్టడంతో పాటు తన నిలకడను చూసి కెప్టెన్సీ ఇవ్వాలని గౌతమ్ గంభీర్ కోరుతున్నాడని సమాచారం. అయితే, బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం అనుభవజ్ఞుడైన రిషభ్ పంత్ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, మరీ దూకుడుగా, కొన్నిసార్లు బాధ్యతారాహిత్యంగా ఆడతాడని విమర్శలు ఉన్న పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే, కెరీర్ తొలి దశలోనే ఉన్న, యశస్విని సారథిగా ఎంపిక చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఇక, బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటదనే దానిపై ఉత్కంఠత కొనసాగుతుంది.