రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. టీం ఇండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ భారత టెస్ట్ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఉండటానికి అనువైన ప్లేయర్‌లు అని అభిప్రాయపడ్డారు. వారి వయసును పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఐపీఎల్ జట్లకు కెప్టెన్లుగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.…
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) రాబోయే సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ఖరారు చేయడానికి.. భవిష్యత్ టెస్ట్ కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు కీలకమైన సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పాల్గొననున్నారు.
Rohit Sharma: భారత క్రికెట్ జట్టు ఇటీవల టెస్టు క్రికెట్‌లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఓటమి, అలాగే ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోలేకపోవడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శన కూడా తివారంగా నిరాశపరిచింది. ముఖ్యంగా, ఆసీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయడం అతడి బ్యాటింగ్…
Yashasvi Jaiswal: రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్ ఎవరు? అనే అంశం ఇప్పుడు భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలోనే రోహిత్ రిటైర్మెంట్‌పై చర్చ జరిగింది.