ఐసీసీ ప్రపంచ కప్ 2021 టోర్నీలో టీం ఇండియా ఈ రోజు అతి ముఖ్యమైన మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే భారత జట్టు గురించి మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ… ఈరోజు మ్యాచ్ లో భువనేశ్వర్ కంటే శార్దూల్ ఠాకూర్ ఉంటె బాగుంటుంది అన్నాడు. అయితే ఇది భువీకి చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ అవుతుంది కావచ్చు అన్నారు. ఎందుకంటే గత రెండు సీజన్ లలో అతని పేస్ గణనీయంగా పడిపోయింది. అయినప్పటికీ జట్టు అతని అనుభవాన్ని నమ్ముతుంది అన్నాడు.కానీ ఈరోజు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ భువనేశ్వర్ కుమార్ ను కాకుండా శార్దూల్ ఠాకూర్‌ను తప్పక ఎంపిక చేయాలని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. భువీ కంటే శార్దూల్ బాగా బ్యాటింగ్ చేస్తాడు. అతను వికెట్ టేకింగ్ బౌలర్. కాబట్టి అతడిని తీసుకుంటే బ్యాటింగ్ లో కొంత బలం కూడా పెరుగుతుంది అని చెప్పాడు.