Virat Kohli: స్టేడియంలో విరాట్ కోహ్లీ ఎంత ఉత్సహంగా ఉంటాడో.. అంతే సీరియస్ గా అతడిని లేదా జట్టును ఎవరైనా టార్గెట్ చేస్తే స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇస్తాడు. అది బౌలర్లా.. ప్రేక్షకులా? అనేది కోహ్లీ పట్టించుకోడు. ఇక, ఆస్ట్రేలియా టూర్ లో అందరి చూపు విరాట్ మీదే ఉన్నాయి. మెల్‌బోర్న్‌లో ఆసీస్ ఫ్యాన్స్ కోహ్లీని ఎగతాళి చేయగా.. ఇప్పుడు సిడ్నీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీతో పాటు భారత ఆటగాళ్లను టార్గెట్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
Read Also: Sankranthiki Vasthunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ హీరో వెంకటేష్ కాదట.. ఆయనేనట ?
అయితే, సిడ్నీ టెస్టుకు స్టాండింగ్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా రెండో రోజు చివరి సెషన్‌లో గాయంతో డగౌట్‌కు వెళ్లిపోయాడు. అంతకుముందు అతడి షూస్‌లో సాండ్ పేపర్ ఉందని పలు వీడియోలను ఆస్ట్రేలియా ఫ్యాన్స్ షేర్ చేశారు. దీనిపై ఐసీసీ విచారణ చేపట్టాలంటూ కామెంట్స్ పెట్టారు. ఇక, ఇవాళ బుమ్రా బౌలింగ్‌కు రాలేదు.. దీంతో జట్టును విరాట్ కోహ్లీ నడిపిస్తున్నాడు. అయినా, సరే ఆసీస్ అభిమానులు అరుస్తూనే ఉండటంతో.. స్టీవ్ స్మిత్ ఔటైన తర్వాత విరాట్ తన జేబులో రెండు చేతులు పెట్టి ‘నా దగ్గర ఏమీ లేదు చూసుకోండి’ అన్నట్లు వారికి సైగలు చేశాడు. స్మిత్ సాండ్ పేపర్ స్కాంలో ఇరుక్కున్నాడు.. బుమ్రాపై వస్తున్న ట్రోల్స్‌కు కౌంటర్‌గా ఈ విధంగా విరాట్ రియాక్ట్ కావడంతో ఇండియన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆటగాళ్లు ఆసీస్‌లా మోసం చేయరంటూ సోషల్ మీడియాలో టీమిండియా అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
"What is that about?"#AUSvIND pic.twitter.com/HwNZXhKW1S
— cricket.com.au (@cricketcomau) January 5, 2025