జట్టును విరాట్ కోహ్లీ నడిపిస్తున్నాడు. అయినా, సరే ఆసీస్ అభిమానులు అరుస్తూనే ఉండటంతో.. స్టీవ్ స్మిత్ ఔటైన తర్వాత విరాట్ తన జేబులో రెండు చేతులు పెట్టి ‘నా దగ్గర ఏమీ లేదు చూసుకోండి’ అన్నట్లు వారికి సైగలు చేశాడు.
Virat Kohli Fire On Australia Fans: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో విరాట్ కోహ్లీని ఆసీస్ అభిమానులు అవమానించిన ఘటన రెండో రోజు ఆటలో జరిగింది. ఇందుకు సంబంధించి చూస్తే.. విరాట్ 86 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే అతను ఆడుతున్నప్పుడు ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. మొదట ఆఫ్‌సైడ్ బంతులను ఆడకుండా వదిలేస్తూ ‘క్రమశిక్షణ’ పాటిస్తున్నట్లుగా ఆయన కనిపించినా, చివరికి అదే బలహీనతను పునరావృతం చేసి మరోసారి…