Sydney Test: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో భారత్ కోల్పోయింది.
జట్టును విరాట్ కోహ్లీ నడిపిస్తున్నాడు. అయినా, సరే ఆసీస్ అభిమానులు అరుస్తూనే ఉండటంతో.. స్టీవ్ స్మిత్ ఔటైన తర్వాత విరాట్ తన జేబులో రెండు చేతులు పెట్టి ‘నా దగ్గర ఏమీ లేదు చూసుకోండి’ అన్నట్లు వారికి సైగలు చేశాడు.
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరుగుతున్న టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రోజు ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. దింతో భారత్ మొత్తం ఆధిక్యం 145 పరుగులకు చేరుకుంది. ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా 39 బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో 8 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 17 బంతుల్లో 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా తరఫున స్కాట్…
మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. రోహిత్ శర్మను కోచ్ గౌతమ్ గంభీర్ అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. హిట్ మ్యాన్ లాంటి ప్లేయర్‌ను బెంచ్ మీద కూచోబెట్టడం దారుణమంటూ మండిపడ్డారు.
Rohit Sharma On Retirement: సిడ్నీ టెస్ట్‌కు దూరంగా కూర్చోవడం అంటే తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు కాదని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. దీనితో పాటు, తన పేలవమైన ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని సిడ్నీ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తన నిర్ణయాన్ని మ్యాచ్‌కు ఒక రోజు ముందు కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు చెప్పానని తెలిపాడు. దాంతో సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్…
IND vs AUS: భారత్ – ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుండగా.. రెండో రోజు లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు తొలి సెషన్ లో టీమిండియా బౌలర్లు ఆధిపత్యాన్ని చూపించారు. ఆస్ట్రేలియా రెండో రోజు మొదటి…
IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఐదవ, చివరి టెస్ట్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 185 పరుగులకు ఆలౌటైంది. ఇక moiరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా కూడా 9 పరుగులకే 1 వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బాట్స్మెన్ ఉస్మాన్ ఖవాజాను టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్ కు పంపించాడు. ఉస్మాన్ ఖవాజా వికెట్‌కు ముందు..…
IND vs AUS: టీమిండియా మరోసారి తక్కువ పరుగులకే అలౌటై క్రికెట్ అభిమానులను నివసిపరిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు సిడ్నీ వేదికగా చివరి టెస్ట్ మొదలుకాగా.. మొదటి రోజే టీమిండియా 185 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా వరుస క్రమంలో టికెట్లు కోల్పోతూ తక్కువ స్కోరుకే పరిమితమైంది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.…
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరుగుతోంది. తొలి రెండు సెషన్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషబ్ పంత్‌తో పాటు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. అయితే.. సిడ్నీ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పిచ్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ చేతికి గాయం అయింది.
RIP GOUTAM GAMBHIR: టీమిండియా ఐదో టెస్టులో కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత, క్రికెట్ అభిమానులు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మను ఐదో టెస్ట్ నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో “RIP Gautam Gambhir” అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశించి వేలాదిగా ట్వీట్లు చేస్తున్నారు. గంభీర్ టీమ్ మేనేజ్‌మెంట్‌లో…