ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న వేలం కోసం ఏకంగా 1,355 మంది ఆటగాళ్లు అధికారికంగా నమోదు చేసుకున్నారు. క్రిక్‌బజ్ ప్రకారం ఆటగాళ్ల జాబితా లిస్ట్ 13 పేజీలు ఉండడం విశేషం. ఓ మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్ రావడం ఇదే మొదటిసారి. రిజిస్ట్రేషన్ లిస్ట్‌లో 14 దేశాల నుంచి ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలంలో ప్రాంచైజీల మధ్య పోటీ బాగా ఉండనుంది. ఇందుకు కారణం…
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2025లోని మొదటి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్ల ప్రదర్శన చేయడంతో రబాడ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రబాడ ఇప్పటివరకు 71 టెస్టుల్లో 332 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో రబాడ అత్యుత్తమ గణాంకాలు 7/112 కాగా.. 10 వికెట్స్…
ఆస్ట్రేలియాను స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025లో స్మిత్ (66; 112 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో ఇదివరకు ఆస్ట్రేలియాకే చెందిన వారెన్ బార్డ్స్లీ (575 పరుగులు) అగ్ర స్థానంలో ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో స్మిత్ టాప్…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీ ఫైనల్లో భారత్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు స్మిత్ తన నిర్ణయం ప్రకటించాడు. అయితే, 170 వన్డేల్లో 5,800 పరుగులు చేసిన స్మిత్.. 12 సెంచరీలు.. 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల్లో ఆసీస్ కెప్టెన్ స్మిత్ అత్యధిక స్కోర్ 164 పరుగులు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఏకంగా ఐదుగురు స్టార్ ప్లేయర్స్ దూరమయ్యారు. గాయాల కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వైదొలగగా.. ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో స్టార్క్ టోర్నీకి దూరమయ్యాడు. కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో 15 మంది సభ్యుల జట్టులో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పలు మార్పులు చేసింది. గాయం కారణంగా…
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సెంచరీల పరంపర కొనసాగిస్తున్నాడు. ఇటీవల అతను నాలుగు సెంచరీలు సాధించాడు. గత 8 ప్రొఫెషనల్ మ్యాచ్‌లను కూడా కలుపుకుంటే అతను మొత్తం 5 సెంచరీలు సాధించాడు. వాటిలో ఒకటి టీ20 లీగ్‌లో జరిగింది. తాజాగా.. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో స్మిత్ సెంచరీ సాధించి అనేక రికార్డులు సాధించాడు. స్టీవ్ స్మిత్ 191 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది అతని టెస్ట్ క్రికెట్‌లో 36వ సెంచరీ.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 10 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ ఈ మార్క్‌ను అందుకున్నాడు. ప్రబాత్ జయసూర్య వేసిన 31 ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసిన స్మిత్.. సాంప్రదాయ ఫార్మాట్‌లో 10 వేల రన్స్ పూర్తి చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్న స్మిత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 115…
ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ సాంప్రదాయ ఫార్మాట్‌లో 10 వేల మైలురాయికి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే స్మిత్ పెవిలియన్‌కు చేరాడు. స్మిత్ కెరీర్‌లో కీలక మైలురాయిని అందుకుంటాడని ఆసీస్ ఫాన్స్, క్రికెటర్స్ ఆశగా చూస్తున వేళ.. భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ అతడిని ఔట్ చేశాడు. దాంతో కంగారో ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా దీనిపై స్మిత్…
జట్టును విరాట్ కోహ్లీ నడిపిస్తున్నాడు. అయినా, సరే ఆసీస్ అభిమానులు అరుస్తూనే ఉండటంతో.. స్టీవ్ స్మిత్ ఔటైన తర్వాత విరాట్ తన జేబులో రెండు చేతులు పెట్టి ‘నా దగ్గర ఏమీ లేదు చూసుకోండి’ అన్నట్లు వారికి సైగలు చేశాడు.
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25 సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాల్గవ టెస్ట్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరుగుతోంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 26న మొదలు కాగా.. నేడు మూడో రోజు (డిసెంబర్ 28) భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోంది. లంచ్ సమయానికి భారత జట్టు స్కోరు 244/7 వద్ద కొనసాగుతుంది. క్రీజులో వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఫాలోఆన్‌ను తప్పించుకోవాలంటే…