ప్రస్తుతం కోహ్లీ కెప్టెన్సీలోని ఓ భారత జట్టు ఇంగ్లాండ్ లో ఉండగా శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో భారత జట్టు శ్రీలంకకు వెళ్తుంది. అందుకోసం ఆ జట్టు రేపటి నుండి క్వారంటైన్ లోకి వెళ్లనుంది. 14 నుంచి 28వ తేదీ వరకు ఆటగాలందరు ముంబైలోని ఓ హోటల్లో క్వారంటైన్‌లో ఉంటారు. ఈ 14 రోజుల్లో ఆటగాళ్లకు ఆరుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా… అందులో నెగెటివ్ వచ్చినవారు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో లంకకు వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత చేరిన తర్వాత మన ఆటగాళ్లు మూడు రోజులు క్వారంటైన్‌లో ఉంటారు. ఇక జులై 13న ఆరంభమయ్యే ఈ పర్యటనలోటీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న విషయం తెలిసిందే.