Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమాలంటే చాలు, పనిగట్టుకుని తక్కువ చేసి మాట్లాడటం కొందరు తమిళ జర్నలిస్టులకు ఈ మధ్య అలవాటుగా మారిపోయింది. గతంలో ఏదో తమిళ సినిమాను పొగుడుతూ తెలుగు చిత్రాలను అవహేళన చేసేలా మాట్లాడిన ఓ తమిళ జర్నలిస్ట్, తాజాగా మరోసారి తన వక్ర బుద్ధిని బయటపెట్టే ప్రయత్నం చేశాడు. రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ మూవీ ‘పెద్ది’లో శృతి హాసన్ చేసిన స్పెషల్ సాంగ్, ఆమె డ్రెస్సింగ్ విషయంలో వివాదం రేపి సెన్సేషన్ క్రియేట్ చేద్దామనుకున్నాడు. కానీ, అతడికి ఊహించని షాక్ తగిలింది! ఇటీవల ‘పెద్ది’ సినిమా డ్రెస్సింగ్ విషయంలో హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అచ్చం అలాగే శృతి హాసన్‌ను కూడా రెచ్చగొట్టి, తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అంటే ఏదో తప్పు అన్నట్లుగా ఆమె నోటితోనే అనిపించాలని ఆ జర్నలిస్ట్ ప్లాన్ వేశాడు. ఇంటర్వ్యూలో ఆ జర్నలిస్ట్ శృతిని ఉద్దేశించి.. “పెద్ది సినిమాలో మీరు చేసిన స్పెషల్ సాంగ్‌ను ఎలా చూస్తారు? ఎందుకంటే, అలాంటి పాటలను ఒక ప్రత్యేక ఉద్దేశంతోనే (గ్లామర్ కోసమే) పెడతారని మీకు తెలుసు కదా..” అంటూ చాలా తెలివిగా ఆమెను ఇరకాటంలో పెట్టే ప్రశ్న వేశాడు. అయితే ఆ జర్నలిస్ట్ ఆశలపై నీళ్లు చల్లుతూ, శృతి హాసన్ ఏమాత్రం తడబడకుండా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నాకు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం, అందంగా రెడీ అవ్వడం అంటే ఇష్టం. ఈ పాటను నేను ఆ కోణంలోనే చూస్తాను. గ్లామర్ విషయంలో నా ఆలోచనా విధానం నాకు చాలా స్వేచ్ఛను ఇస్తుంది.
Also Read
ఎవరినో మెప్పించడం కోసం నేను ఎప్పుడూ ఏ పనీ చేయలేదు” అంటూ కుండబద్దలు కొట్టింది. అంతటితో ఆగకుండా, డ్రెస్సింగ్ విషయంలో తన క్లారిటీ ఏంటో గట్టిగానే చెప్పేసింది. “నాకు ఏదైనా డ్రెస్ కంఫర్టబుల్‌గా అనిపించకపోతే, ‘నేను ఇది వేసుకోను’ అని మొహం మీదే చెప్పేస్తాను. ఒకవేళ నేను ఆ డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేశానంటే, అది నాకు పూర్తిగా కంఫర్టబుల్‌గా ఉన్నట్టే లెక్క!” అంటూ తేల్చి చెప్పేసింది. ఈ విషయంలో సెట్స్‌లో వాదనలు కూడా జరిగాయని, తనను ‘డిఫికల్ట్’ అని ముద్ర వేసినా తాను పట్టించుకోనని శృతి స్పష్టం చేసింది. “ఎందుకంటే అది నా శరీరం, నా ఇష్టం!” అంటూ నవ్వుతూనే ఆ జర్నలిస్ట్ నోరు మూయించింది. తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అంటే ఏదో బలవంతంగా చేయిస్తారన్నట్లుగా బిల్డప్ ఇవ్వబోయిన ఆ తమిళ జర్నలిస్ట్‌కు, అటు డ్రెస్సింగ్ విషయంలో అనవసర రాద్ధాంతం చేసిన జాన్వీ కపూర్‌కు శృతి హాసన్ తన ఒక్క సమాధానంతోనే గట్టిగా బుద్ధి చెప్పిందంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
-
Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
-
Family Pack Teaser : “గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు!”:
-
Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!