Monank Patel Said I Played with Axar Patel and Jasprit Bumrah in India: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా తాజాగా భారత్, అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినా.. ఓ దశలో రోహిత్ సేనను అమెరికా వణికించింది. ఇందుకు కారణం భారత సంతతి ఆటగాళ్లే. అమెరికా జట్టులో సగానికి పైగా భారత సంతతి ఆటగాళ్లు ఆడుతున్నారు. అందులో కొంతమంది జూనియర్ లెవల్‌లో భారత్…
Sunil Gavaskar on ఐపీఎల్ Virat Kohli Form: 2024లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్. 15 మ్యాచ్‌లలో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. పదిహేను రోజులు తిరిగేసరికి పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో తేలిపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్‌కే (1, 4, 0) పరిమితమయ్యాడు. దీంతో విరాట్ ఫామ్‌పై మళ్లీ ఆందోళన నెలకొంది. యూఎస్‌ఏ పిచ్‌లపై ఆచితూచి ఆడాల్సిన సమయంలో ఒత్తిడికి గురై…
What happend To Virat Kohli in T20 World Cup 2024: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి.. జట్టుకు అద్భుత ఆరంభాలు అందించాడు. 15 మ్యాచ్‌లలో 741 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ ఫామ్‌తో టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ మాదిరే మెగా టోర్నీలో మెరుపులు మెరిస్తాడనుకుంటే.. వరుస వైఫల్యాలతో…
Rohit Sharma become India’s second most successful captain in ICC Events: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ మెగా టోర్నీల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ రెకార్డుల్లోకెక్కాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలవడంతో హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. కెప్టెన్‌గా రోహిత్ 20 మ్యాచ్‌ల్లో 17 విజయాలు భారత జట్టుకు అందించాడు. ఈ…
Arshdeep Singh Thanks Rohit Sharma For Belief: టీ20 ప్రపంచకప్ 2024లో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో ఎక్కువ పరుగులు ఇచ్చానని, యూఎస్‌ఏపై తన ప్రదర్శనతో అసంతృప్తిగా ఉన్నానని భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఎక్కువ రన్స్ ఇచ్చినా.. తనపై నమ్మకం ఉంచిన టీమిండియా మేనేజ్‌మెంట్, కెప్టెన్ రోహిత్ శర్మకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. పరుగులు చేయడానికి ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా బంతులేశాం అని చెప్పాడు. సూపర్ 8లోనూ…
Arshdeep Singh Breaks R Ashwin T20 World Cup Record: భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌లో 10 పరుగులు కంటే తక్కువ ఇచ్చి.. నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా యూఎస్‌ఏపై (4-0-9-4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో ఈ రికార్డు అర్ష్‌దీప్ ఖాతాలో చేరింది. ఈ క్రమంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (4/11) రికార్డును అర్ష్‌దీప్…
Aaron Jones on USA Defeat vs IND: బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువ చేయడమే తమ ఓటమిని శాసించిందని అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్ తెలిపాడు. తమ బౌలింగ్ యూనిట్ గురించి చాలా గర్వపడుతున్నానన్నాడు. మా తప్పిదాలను తెలుసుకొని పుంజుకుంటాం అని జోన్స్ ధీమా వ్యక్తం చేశాడు. అమెరికా రెగ్యులర్ కెప్టెన్ మొనాంక్ పటేల్ గాయపడడంతో ఆరోన్ జోన్స్ జట్టు బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం టీమిండియాతో…
Rohit Sharma Hails Shivam Dube and Suryakumar Yadav: కఠినమైన న్యూయార్క్ పిచ్‌పై పరుగులు చేయడం చాలా కష్టం అని.. సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేల అద్భుత బ్యాటింగ్‌తోనే తాము గెలిచాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అర్ష్‌దీప్ సింగ్ అసాధారణ ప్రదర్శన చేశాడని ప్రశంసలు కురిపించాడు. అమెరికా జట్టులోని అందరూ బాగా ఆడుతున్నారన్నాడు. సూపర్ 8కు అర్హత సాధించడం సంతోషంగా ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా…
Do You Know Why USA Fined 5 Runs vs India: టీ20 ప్రపంచకప్ 2024లో అసాధారణ ప్రదర్శన చేస్తున్న అమెరికా.. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించింది. కఠినమైన న్యూయార్క్ పిచ్‌పై ముందుగా బ్యాటింగ్‌తో అదరగొట్టిన యూఎస్‌ఏ.. ఆపై సువర్ బౌలింగ్‌తో టీమిండియాని వణికించింది. ఓ దశలో అయితే మ్యాచ్‌పై పట్టు సాధించి.. గెలిచేలా కనిపించింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్తగా ప్రవేశపెట్టిన ‘స్టాప్ క్లాక్’ రూల్ అమెరికా కొంపముంచింది.…
India Thrash United States in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుని సూపర్-8లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన పరీక్షగా మారిన న్యూయార్క్ స్టేడియంలో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ చెమటోడ్చాల్సి వచ్చింది. 3 వికెట్లు కోల్పోయి కానీ.. 18.2 ఓవర్లకు లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.…