200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR 700 Series: హానర్ (HONOR) నుండి HONOR 700 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇందులో HONOR 700S, HONOR 700, HONOR 700 Pro పేర్లతో మూడు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లలో 9000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, 120Hz OLED డిస్ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్ వెనుక భాగంలో 1.59 అంగుళాల ప్రత్యేక డైనమిక్ డిస్ప్లేను అందించారు.
HONOR 700S
HONOR 700 సిరీస్‌లో బేస్ మోడల్ అయిన 700Sలో 6.57 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ HBM బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 1.59 అంగుళాల AMOLED డైనమిక్ డిస్ప్లే ఉంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 12GB RAM, 256GB/512GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో OIS సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 9000mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. IP68, IP69, IP69K రేటింగ్స్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది.
Also Read
- చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
- Motorola G Max: రూ.19,499కే Motorola G Max 5G ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే డీల్!
- Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్ప్లే, 33W ఛార్జింగ్!
- Huawei OSTA O1 Pro: ప్రపంచంలోనే తొలి Wide Screen ఫోన్ లాంచ్.. 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Huawei OSTA O1 Pro!
ధరలు:
* 12GB RAM + 256GB స్టోరేజ్ – 3,599 యువాన్లు (సుమారు రూ.50,045).
* 12GB RAM + 512GB స్టోరేజ్ – 3,899 యువాన్లు (సుమారు రూ.54,220).

HONOR 700
HONOR 700 మోడల్లోనూ 6.57 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, వెనుకవైపు 1.59 అంగుళాల డైనమిక్ డిస్ప్లే ఉన్నాయి. అయితే ఇందులో మరింత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌ను అందించారు. 12GB, 16GB RAM ఆప్షన్లతో పాటు 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. కెమెరా విభాగంలో OISతో కూడిన 200MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇచ్చారు. ఇది 3.5X ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. 9000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు IP68, IP69, IP69K రేటింగ్స్ కూడా ఉన్నాయి.
ధరలు:
– 12GB RAM + 256GB స్టోరేజ్ – 3,999 యువాన్లు (సుమారు రూ.55,610).
– 16GB RAM + 256GB స్టోరేజ్ – 4,199 యువాన్లు (సుమారు రూ.58,390).
– 12GB RAM + 512GB స్టోరేజ్ – 4,299 యువాన్లు (సుమారు రూ.59,780).
– 16GB RAM + 512GB స్టోరేజ్ – 4,899 యువాన్లు (సుమారు రూ.68,125).

HONOR 700 Pro
ఈ సిరీస్‌లో టాప్-ఎండ్ మోడల్ అయిన HONOR 700 Proలో 6.57 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1.59 అంగుళాల రియర్ డిస్ప్లే ఉన్నాయి. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్‌ను అమర్చారు. 12GB, 16GB RAMతో పాటు 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కెమెరాల పరంగా 200MP OIS ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 3.5X ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్లోనూ 9000mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. ప్రత్యేకంగా 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు.
ధరలు:
– 12GB RAM + 256GB స్టోరేజ్ – 4,599 యువాన్లు (సుమారు రూ.63,950).
– 12GB RAM + 512GB స్టోరేజ్ – 4,999 యువాన్లు (సుమారు రూ.69,515).
– 16GB RAM + 512GB స్టోరేజ్ – 5,099 యువాన్లు (సుమారు రూ.70,905).
ఈ మూడు ఫోన్లలోనూ Android 17 ఆధారిత MagicOS 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. వెనుకవైపు ఉన్న 1.59 అంగుళాల డిస్ప్లే ద్వారా నోటిఫికేషన్లు చూడటంతో పాటు ప్రధాన కెమెరాతో సెల్ఫీలు తీసుకోవచ్చు. అలాగే PPG సెన్సార్ సాయంతో హార్ట్ రేట్, SpO2, HRV వంటి ఆరోగ్య సంబంధిత వివరాలను 60 సెకన్లలో అంచనా వేయవచ్చు. ఈ ఫోన్లు ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 27 నుంచి అమ్మకాలు మొదలు కానున్నాయి. HONOR 700, 700 Pro ఫోన్లకు ప్రత్యేకంగా Telephoto Converter G200 యాక్సెసరీని 899 యువాన్లకు, ఫిల్టర్ లెన్స్ సెట్‌ను 299 యువాన్లకు అందిస్తున్నారు. చైనా కాకుండా గ్లోబల్ మార్కెట్లలో విడుదలపై వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

తాజావార్తలు
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Nandamuri Balakrishna: ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి.. కొత్త కౌన్సిలర్లకు బాలయ్య కీలక సందేశం
-
Henry Nicholls: మా బ్యాటర్లు తోపు, ఓడిపోయే మ్యాచ్‌ను డ్రా చేశారు.. హెన్రీ నికోల్స్ ఆనందం!
-
Stock Market Crash: బ్లాక్ మండే.. స్టాక్ మార్కెట్లో భారీ విధ్వంసం.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి..!
-
Komatireddy Venkat Reddy: 100 సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం!
ట్రెండింగ్
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!