Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా స్టాక్ మార్కెట్లలో సోమవారం భారీ ర్యాలీ కనిపించింది. చిప్‌మేకింగ్ దిగ్గజం ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ తిరిగి ఆ సంస్థ సీఈఓగా బాధ్యతలు చేపట్టడం మార్కెట్లలో కొత్త జోష్ నింపింది. అయితే, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా మార్కెట్లలో 3 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.270 లక్షల కోట్లు) సంపద పెరగలేదు. వాస్తవానికి, హువాంగ్ రాకతో ఒక్క ఎన్విడియా షేర్లు 27 నుంచి 30 శాతం మేర ఎగబాకి, ఆ కంపెనీ మార్కెట్ విలువ సుమారు 900 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.85 లక్షల కోట్లు) వరకు పెరిగింది. దీంతో ఎన్విడియా మొత్తం మార్కెట్ విలువ 3.025 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
అసలేం జరిగింది..?
వ్యక్తిగత వివాదాల కారణంగా జెన్సన్ హువాంగ్ ఈ నెల 12న సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన నిష్క్రమణతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలై, గత తొమ్మిది రోజుల్లో ఎన్విడియా మార్కెట్ విలువ సుమారు 1 ట్రిలియన్ డాలర్ల మేర పడిపోయింది. అంతేకాకుండా, ఎస్ అండ్ పి 500, నాస్డాక్ సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థ ప్రయోజనాల దృష్ట్యా హువాంగ్ను తిరిగి అధ్యక్షుడిగా, సీఈఓగా నియమిస్తున్నట్లు ఎన్విడియా బోర్డు సోమవారం ప్రకటించింది.
Also Read
మార్కెట్లపై ప్రభావం..
హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టారన్న వార్త వెలువడగానే అమెరికా ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో ఎన్విడియా షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. ఏఐ (AI) రంగంలో ఎన్విడియా కీలక పాత్ర పోషిస్తున్నందున, ఆ సంస్థ నాయకత్వంపై మళ్లీ నమ్మకం కుదరడం అమెరికా టెక్ స్టాక్స్‌కు ఊరటనిచ్చింది. అయితే, హువాంగ్‌పై ఉన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కొనసాగుతుందని, జాతీయ భద్రత కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని కంపెనీ బోర్డు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
-
Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
-
Family Pack Teaser : “గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు!”:
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!