India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan T20 World Cup Final: కొన్ని మ్యాచ్‌లు చరిత్రలో నిలిచిపోతాయి.. మరిచిపోలేని మధురానుభూతిని అందిస్తాయి.. అందులో ఒకటి.. చరిత్ర సృష్టించిన మ్యాచ్.. సెప్టెంబర్ 24, 2007.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వాండరర్స్ స్టేడియంలో జరిగిన తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని యువ భారత జట్టు తొలి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
గంభీర్ అద్భుత ఇన్నింగ్స్
టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో వికెట్లు కోల్పోయినప్పటికీ గౌతమ్ గంభీర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 54 బంతుల్లో 75 పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. రోహిత్ శర్మ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి, పాకిస్థాన్ ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్ బౌలర్ ఉమర్ గుల్ మూడు వికెట్లు పడగొట్టాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
పాకిస్థాన్ పోరాటం
158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. మహమ్మద్ హఫీజ్ ఒక పరుగుకే ఔటయ్యాడు. అయితే ఇమ్రాన్ నజీర్ కేవలం 14 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టుకు వేగం అందించాడు. అనంతరం వరుస వికెట్లతో పాకిస్థాన్ ఒత్తిడిలో పడింది. ఒక దశలో 6 వికెట్లకు 77 పరుగులకే పరిమితమైంది. అయితే మిస్బా-ఉల్-హక్ అద్భుత పోరాటం చేశాడు. హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను మళ్లీ పాకిస్థాన్ వైపు మళ్లించాడు. చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయానికి చేరువ చేశాడు.
చివరి ఓవర్లో ఉత్కంఠ
పాకిస్థాన్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. కెప్టెన్ ధోనీ బంతిని జోగిందర్ శర్మకు అందించాడు. తొలి బంతి వైడ్ కాగా, రెండో బంతికి మిస్బా పరుగులు చేయలేదు. ఆ తర్వాతి బంతిని ఫుల్‌టాస్‌గా అందుకున్న మిస్బా సిక్సర్‌గా మలిచాడు. ఇక పాకిస్థాన్ విజయానికి నాలుగు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఈ సమయంలో మిస్బా స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి లేవగా శ్రీశాంత్ ముందుకు వచ్చి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. అంతే.. భారత శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి.
భారత్‌కు తొలి టీ20 ప్రపంచకప్
మిస్బా 43 పరుగులతో పాకిస్థాన్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరికి పాకిస్థాన్ 152 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ఆర్పీ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ చెరో మూడు వికెట్లు తీయగా, జోగిందర్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో కీలక ప్రదర్శన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. షాహిద్ అఫ్రిది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్.. 24 ఏళ్ల తర్వాత ధోనీ సారథ్యంలో మరో ప్రపంచకప్‌ను అందుకుంది. చివరి ఓవర్, మిస్బా షాట్, శ్రీశాంత్ క్యాచ్ మాత్రం ఈ మ్యాచ్‌ను భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయేలా చేసింది.. సెప్టెంబర్ 24వ తేదీ సందర్భంగా ఆ అపూర్వ విజయాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం..
#OnThisDay India defeated Pakistan in a thrilling final to win the first edition of the #T20WorldCup 🏆
Some outstanding performances from @GautamGambhir and @captainmisbahpk saw the match decided by just five runs! pic.twitter.com/TAXx3skjrh
— T20 World Cup (@T20WorldCup) September 24, 2019
తాజావార్తలు
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..