IND vs USA: భారత్ vs మినీ భారత్.. అమెరికా జట్టులో 8 మంది భారత సంతతి ఆటగాళ్లు!
- భారత్ vs మినీ భారత్
- న్యూజీలాండ్ హిట్టర్ కోరే ఆండర్సన్
- అండర్ 19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
8 Indian Players in United States Team: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా నేడు అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్-ఏలో ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. మంచి జోష్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా.. హ్యాట్రిక్ విజయంతో పాటు సూపర్-8 బెర్త్ కూడా దక్కుతుంది. దాంతో విజయం కోసమే అమెరికా, భారత్ బరిలోకి దిగనున్నాయి. అయితే అమెరికా జట్టులో 8 మంది భారత సంతతి ఆటగాళ్లు ఉండడం విశేషం.
అమెరికా జట్టును మినీ భారత్‌గా భావించవచ్చు. ఎందుకంటే.. యూఎస్ జట్టులో ఏకంగా ఎనిమిది మంది భారత సంతతి ఆటగాళ్లు ఉన్నారు. పాకిస్థాన్‌తో ఆడిన జట్టులో కెప్టెన్ మోనాంక్ పటేల్ సహా ఆరుగురు భారతీయులు ఉన్నారు. హర్మీత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, జస్‌దీప్ సింగ్, నోస్తుష ప్రదీప్ కెంజిగె, నితీశ్ కుమార్ కూడా భారత క్రికెటర్లే. భారత్ నుంచి అండర్ 19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ కూడా యూఎస్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే అతడు టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపిక కాలేదు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: USA vs IND: నేడు అమెరికాతో మ్యాచ్.. హ్యాట్రిక్‌పై భారత్ గురి!
న్యూజీలాండ్ హిట్టర్ కోరే ఆండర్సన్ కూడా ఇప్పుడు అమెరికాకు ఆడుతున్నాడు. ప్రస్తుతం అతడు టీ20 ప్రపంచకప్ 2024లో ఆడుతున్నాడు. అయితే అతడికి ఇంకా చెలరేగే అవకాశం రాలేదు. మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రావల్కర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరిపై యూఎస్ భారీ అంచనాలు పెట్టుకుంది. యుఎస్ ఆటగాళ్లు ఒకప్పుడు భారత్‌లో ఆడినవాళ్లే కావడంతో.. భారత్, అమెరికా మ్యాచ్ ఆసక్తిరేపుతోంది. భారత్ vs మినీ భారత్‌గా ఈ మ్యాచ్‌ను భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..