Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harmanpreet Kaur: మహిళల T20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు తొలి ఓటమిని రుచిచూసిన తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన జట్టు బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జూన్ 21న జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో శ్రీ చరణి మూడు వికెట్లు తీయగా.. షెఫాలీ వర్మ ఒక వికెట్ తీసింది. అయితే మిగతా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఇక మ్యాచ్ తర్వాత మాట్లాడిన జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. మాకు కొన్ని కీలక అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయామని, ఇంకా టోర్నీలో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నందున సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని తెలిపింది.
Also Read
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
మ్యాచ్ మధ్యలో మాకు కొన్ని అవకాశాలు లభించాయి. అయినా వాటిని అందుకోలేకపోయాము. టోర్నీ లీగ్ స్టేజ్‌లో ఇంకా 2 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కాబట్టి.. ఇప్పుడు సానుకూలంగా ఆలోచించి ముందు జరగబోయే మ్యాచ్ లపై దృష్టి పెడతామని తెలిపింది. శ్రీ చరణి, షెఫాలీ అద్భుతంగా బౌలింగ్ చేసారని.. వారు ప్రత్యర్థులకు సవాళ్లు విసిరారు., కానీ ఇతర బౌలర్ల నుంచి సరైన సహకారం లభించలేదు” అని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కాస్త బౌలర్లు పై అసహనం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం టీమిండియా 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో భారత్ తన గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌ల నుంచి నాలుగు పాయింట్లు సాధించిన భారత జట్టు తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తో తలపడనుంది. జూన్ 25న మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో నాలుగు పాయింట్లు సాధించి పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. దీంతో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.
తాజావార్తలు
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?