Suryakumar Yadav Coach Ashok Aswalkar Hails Rishabh Pant: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2024లో దాయాదుల పోరు చూసేందుకు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఐర్లాండ్‌ను చిత్తు చేసిన భారత్ సమరోత్సాహంతో ఉంది. టీమిండియా నుంచి ఎవరు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ బలంగా. అయితే భారత జట్టుకు అదనపు బలం మాత్రం వికెట్ కీపర్ రిషబ్ పంత్ అని సూర్యకుమార్ చిన్ననాటి కోచ్ అశోక్ అశ్వాల్కర్ అన్నాడు. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని వచ్చి అద్భుత ప్రదర్శన చేయడం సాధారణ విషయం కాదన్నాడు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో అశోక్ అశ్వాల్కర్ మాట్లాడుతూ… ‘టీమిండియాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ రిషబ్ పంత్. రోడ్డు ప్రమాద ఘటన నుంచి కోలుకుని ఇక్కడికి టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికవడం అద్భుతం. పంత్మైం డ్‌సెట్ చాలా దృఢమైంది. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగి ఐపీఎల్ 2024లో రాణించాడు. ఇప్పుడుప్రపంచకప్‌లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేస్తున్నాడు. ఐర్లాండ్‌పై బాగా ఆడాడు. పంత్ క్రీజ్‌లో ఉంటే మ్యాచ్ మన చేతుల్లో ఉన్నట్లే. పాకిస్తాన్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి ఆరంభం ఇస్తే తిరుగుండదు. ఒకవేళ రోహిత్-కోహ్లీ నుంచి మంచి ఇన్నింగ్స్ రాకపోతే ఇతర బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది’ అని తెలిపాడు.
Also Read: IND vs PAK: భారత్‌కు 60, పాక్‌కు 40 శాతం విజయావకాశాలు: పాక్ మాజీ స్టార్
2022 డిసెంబరు 30న రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదంకు గురయ్యాడు. నూతన సంవత్సర వేడుకల కోసం జట్టును వీడి ఇంటికి వెళుతుండగా.. వేగంగా వెళుతున్న పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. కారులో మంటలు చెలరేగగా అటుగా వెళుతున్న ఓ వ్యక్తి అతడిని బయటికి తీశాడు. దాంతో పంత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గాయాలు, సర్జరీలతో ఏడాదిన్నర పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2024తో పునరాగమనం చేసి సత్తాచాటాడు. 13 ఇన్నింగ్స్‌లలో 446 రన్స్ చేశాడు. ఈ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికయ్యాడు.