Wasim Akram Feels India Win against Pakistan: Says టీ20 ప్రపంచకప్ 2024లో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. గ్రూప్-ఏలో భాగంగా న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. దాయాదుల సమరం రసవత్తరంగా సాగనుంది. ఇందుకు కారణం పిచ్. న్యూయార్క్ పిచ్ ఒక్కోరోజు ఒక్కోలా ప్రభావం చూపిస్తోంది. కొన్నిసార్లు ఎక్కువ బౌన్స్‌తో బంతి వస్తే.. మరికొన్నిసార్లు పైకి లేవడం లేదు. అవుట్ ఫీల్డ్ కూడా చాలా నెమ్మదిగా ఉంది. ఈ మైదానంలో భారీ స్కోర్లు నమోదు కావడం కూడా కష్టమని ఇప్పటికే తేలిపోయింది. ఈ క్రమంలో ఇండో-పాక్ మ్యాచ్‌పై మాజీ స్టార్లు వకార్ యూనిస్, వసీమ్ అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తన మనస్సు పాకిస్తాన్ గెలుస్తుందని చెబుతుందని పాక్ మాజీ స్టార్ వకార్ యూనిస్ పేర్కొన్నాడు. ‘నా మనస్సు మాత్రం పాకిస్తాన్ గెలుస్తుందని చెబుతుంది. కానీ ఇప్పటి వరకు టోర్నీలో జరిగిన మ్యాచులను చూస్తే.. భారత్ వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఉంది. న్యూయార్క్ పిచ్ పేసర్లకు బాగా అనుకూలంగా ఉంది. తప్పకుండా ఇరు జట్ల మధ్య మంచి పోటీ ఉంటుందని భావిస్తున్నా. బౌన్స్‌ను అంచనా వేయగలిగిన జట్టే మ్యాచ్ విజేతగా నిలుస్తుంది’ అని వకార్ అన్నాడు.
Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో రికార్డ్ సిక్స్‌ర్.. వీడియో వైరల్!
‘ప్రస్తుతం భారత్ ఫామ్‌ను చూస్తే పాకిస్తాన్‌పై విజయం సాధించే అవకాశాలు 60 శాతం ఉన్నాయి. భారత్‌కు 60, పాక్‌కు 40 శాతం అవకాశం ఉందని అనుకుంటున్నా. ఇది టీ20 మ్యాచ్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఏ క్షణంలోనైనా మ్యాచ్ ఫలితం మారే అవకాశాలు ఉంటాయి. అత్యుత్తమంగా ఆడిన జట్టే గెలుస్తుంది’ అని వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు.