IND vs BAN: ఆనందంగా లేను.. విరాట్ కోహ్లీపై కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- టీ20 ప్రపంచకప్‌లో విరాట్ విఫలం
- 4 మ్యాచ్‌ల్లో కలిపి 29 పరుగులు
- ఇలా ఆడటం కూడా మంచిదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Batting Coach Vikram Rathour on Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్గానిస్థాన్‌పై విరాట్ పరుగులు చేసినా.. తనకు ఆనందంగా లేదన్నాడు. విలువైన పరుగులు చేసిన కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్‌గా మలచకుండా ఔట్ కావడం తనను నిరాశపరిచిందన్నాడు. అయితే గత మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగైన ఆట తీరును ప్రదర్శించాడని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారించిన కోహ్లీ.. టీ20 ప్రపంచకప్ 2024లో రాణించడం లేదు. 4 మ్యాచ్‌ల్లో కలిపి 29 పరుగులు మాత్రమే చేశాడు. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 బంతుల్లో 24 పరుగులు చేశాడు.
టీ20ల్లో తక్కువ స్ట్రైక్‌రేట్‌తో విరాట్ కోహ్లీ పరుగులు చేయడం సరైంది కాదనే అభిప్రాయం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లలో నెలకొంది. నేడు సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. విక్రమ్ రాథోడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘అఫ్గానిస్థాన్‌పై విలువైన పరుగులు చేసిన కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్‌గా మలచకుండా ఔట్ కావడం నాకు సంతోషంగా అనిపించలేదు. అయితే గత మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగ్గా ఆడాడు. టీ20 ప్రపంచకప్‌లో సవాళ్లు విసిరే పిచ్‌లపై ఇలా ఆడటం కూడా మంచిదే. బంగ్లాపై విరాట్ మంచి ఇన్నింగ్స్ ఆడుతాడు’ అని విక్రమ్ రాథోడ్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ ‘సూపర్’ పోరు.. మ్యాచ్‌కు భారీ అడ్డంకి!
‘భారత్‌లో ఎక్కువగా పరుగులు చేయని బ్యాటర్లు.. ఇక్కడ రాణించడం శుభ పరిణామం. రిషబ్ పంత్ టాప్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడుతున్నాడు. ఇదే ఆటతీరును మిగతా మ్యాచుల్లోనూ కొనసాగిస్తాం. పిచ్ పరిస్థితులకు అనుగుణంగానే తుది జట్టు ఉంటుంది. అత్యుత్తమ టీమ్‌తోనే బరిలోకి దిగుతాం. అక్షర్ పటేల్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించడం సానుకూలాంశం. న్యూయార్క్‌లో దారుణమైన పిచ్‌లపై ఆడాం. ఇప్పుడు కరేబియన్‌లో కాస్త మెరుగైన మైదానాల్లో ఆడుతున్నాం. బంగ్లాను తక్కువగా అంచనా వేయడం లేదు. నాణ్యమైన స్పిన్నర్లు ఆ జట్టు ఉన్నారు. టీ20 క్రికెట్‌లో ఏ జట్టైనా తీవ్రంగా పోటీనిస్తుంది. విజయం ఎప్పుడైనా తారుమారవుతుంది. పొట్టి క్రికెట్‌లో జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని భారత బ్యాటింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?