IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ ‘సూపర్’ పోరు.. మ్యాచ్‌కు భారీ అడ్డంకి!
- మరికొద్దిగంటల్లో భారత్- బంగ్లా మ్యాచ్
- ఆకాశం మొత్తం మబ్బులు
- రద్దైతే ఒక్కో పాయింట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Likely To Interrupt IND vs BAN Match: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 పోరులో భాగంగా మరికొద్దిగంటల్లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. ఆంటిగ్వా వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు (ఆంటిగ్వాలో ఉదయం 10.30 గంటలకు) మ్యాచ్ ఆరంభం కానుంది. అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం సాధించిన భారత్.. బంగ్లాను మట్టికరిపించి సెమీఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమిపాలైన బంగ్లా.. టీమిండియాపై గెలవాలని ఉవ్విళూరుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరేట్ అయినా.. బంగ్లాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.
ఆటింగ్వా మైదానంలో జరిగిన బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఆ మ్యాచ్ ఫలితం డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారమే తేలింది. ప్రస్తుతం ఆంటిగ్వాలో చిన్నపాటి వర్షం పడింది. అక్కడి వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి ఆకాశం మొత్తం మబ్బులు పట్టి ఉంటాయని తెలుస్తోంది. చిరు జల్లులు పడే అవకాశం ఉందట. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే ప్రమాదం లేకపోలేదు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Redmi Note 13 Pro: సరికొత్త కలర్‌లో ‘రెడ్‌మీ నోట్ 13 ప్రో’.. ధర ఎంతంటే?
భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది. ఓవర్ల కోత లేకుండానే మ్యాచ్ జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. వర్షం కారణంగా భారత్-బంగ్లా మ్యాచ్ టాస్ కాస్త ఆలస్యం కావచ్చట. అయితే అదేమీ ఓవర్లపై ప్రభావం చూపదని తెలుస్తోంది. మొత్తానికి వరణుడు మ్యాచ్‌కు అడ్డంకిగా మారాడు. ఒకవేళ మ్యాచ్ రద్దైతే.. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కుతుంది. మ్యాచ్ జరిగి బంగ్లాపై భారత్ విజయం సాధిస్తే సెమీస్ బెర్తు ఖాయమవుతుంది. వరుసగా రెండు ఓటములతో బంగ్లా ఇంటిముఖం పట్టక తప్పదు.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!