వచ్చే ఆదివారం టీం ఇండియా ఈ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లోనే అత్యంత ముఖ్యమైన మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడుతుంది. అయితే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే భారత జట్టుకు కొన్ని సూచనలు చేసారు లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్. కివీస్ పై మ్యాచ్ లో హార్దిక్ పాండ్య అలాగే భువనేశ్వర్ కుమార్ లను పాకాన పెట్టాలి అని సునీల్ తెలిపారు. వీరి స్థానాల్లో ఇషాన్ కిషన్ అలాగే శార్దూల ఠాకూర్ లను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. పాండ్య బౌలింగ్ చేయకపోతే అతడిని ఓ బ్యాటర్ గా తీసుకోవడం కంటే ఆ స్థానంలో ఇషాన్ కిషన్ ను ఎంపిక చేయాలనీ.. అలాగే బంతితో అంతగా ఆకట్టలేకపోతున్న భువీ స్థానంలో ఆల్ రౌండర్ గా ఉపయోగపడే శార్దూల ఠాకూర్ ను ఎంపిక చేస్తే బాగుంటుంది అని అన్నారు. అలాగే మరి జట్టులో ఎక్కువ మార్పులు చేస్తే టీం ఇండియా భయపడిందని కిసీస్ భావించే అవకాశం ఉంది అని గవాస్కర్ పేర్కొన్నారు.