IND vs SA: నేడు టీ20 సిరీస్‌లో చివరిదైన నాలుగో మ్యాచ్‌లో భారత్ ఈరోజు (శుక్రవారం) దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. ఇప్పటికే రెండు విజయాలు సాధించినా.. బ్యాటింగ్‌లో టీమిండియా తడబడుతోంది. సంజు శాంసన్, తిలక్ వర్మల శతకాలు సిరీస్‌లో ఆ టీమ్ ను ముందంజలో నిలిపాయి. కానీ, జట్టు సమష్టిగా మెరవాల్సిన అవసరం ఉంది. అయితే, సెంచరీ తర్వాత సంజూ వరుసగా రెండు మ్యాచ్ లలోనూ డకౌట్ అయ్యాడు. అలాగే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం మూడు మ్యాచ్ ల్లో కేవలం 26 రన్స్ మాత్రమే చేశాడు. హర్థిక్ పాండ్యా జట్టుకు భరోసా ఇవ్వలేకపోతున్నాడు. భారత్‌కు సిరీస్ దక్కాలంటే బ్యాటుతో పాటు బంతితో పుంజుకోవడం చాలా కీలకం. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్ అభిషేక్ శర్మ.. మూడో టీ20 మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో ఫామ్‌ను అందుకోవడం శుభ సూచకంగా చెప్పుకొవచ్చు.
Read Also: Astrology: నవంబర్ 15, శుక్రవారం దినఫలాలు
అయితే, యంగ్ బ్యాటర్ రింకు సింగ్ ఫామే ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. టీ20 స్పెషలిస్ట్‌గా తన విధ్వంసక ఆటతో ఒక వెలుగు వెలిగిన రింకూ.. గత కొన్ని నెలల్లో ఫామ్‌ను కోల్పోయాడు. సౌతాఫ్రికాలో మూడు మ్యాచ్‌ల్లో కలిపి 28 రన్స్ చేశాడు. ఆరు లేదా ఏడో స్థానలో బ్యాటింగ్‌కు వస్తుండడం వల్ల అతడికి తగినన్ని బాల్స్ ఆడే అవకాశం రావట్లేదన్న భావన కనిపిస్తుంది. రింకూ ఐదో స్థానంలో ఎక్కువగా సక్సెస్ అయ్యాడు. కానీ ఇప్పుడు హార్దిక్‌ను కాదని అతణ్ని ముందుకు పంపడం టీమ్ మేనేజ్మెంట్ కు కష్టమే.
Read Also: Allu Arjun: కోస్తే ఎల్లో బ్లడ్.. బాలయ్య ముందే అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు
కాగా, జొహానెస్‌బర్గ్‌లో పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. లాస్ట్ టైం ఇక్కడ 2023 డిసెంబరులో జరిగిన మ్యాచ్‌లో సూర్య కుమార్ సెంచరీతో భారత్ 7 వికెట్లకు 201 రన్స్ చేసింది. దక్షిణాఫ్రికాను 95కే ఆలౌట్ చేసి ఘన విజయం సాధించింది భారత్. అయితే, మ్యాచ్ ఆరంభానికి ముందు చిరు జల్లులు పడే అవకాశం ఉంది.. కానీ ఆటకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఇక, ఈ సిరీస్‌ను కాపాడుకోవాలనుకుంటున్న సౌతాఫ్రికాకు బ్యాటింగ్‌లో మెరుగుపడడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కెప్టెన్ మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్ రన్స్ బాట పట్టడం చాలా అవసరం. అయితే, యాన్సెన్ ఆల్‌రౌండ్ జోరు ఆతిథ్య జట్టుకు కాస్తా ఊరట ఇస్తుంది. హార్డ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ జోరు కొనసాగించాలని సఫారీ జట్టు కోరుకుంటోంది. అలాగే, ఆ జట్టు బంతితోనూ పుంజుకోవాల్సిన అవసరం ఉంది.