శ్రీలంక క్రికెట్ జట్టు పరిస్థితి దారుణంగా ఉందని మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య అన్నారు. వెంటనే చర్యలు తీసుకొని కాపాడాలని సూచించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న లంక జట్టు మూడు టీ20ల సిరీస్‌ను ఒక్కటి కూడా గెలవకుండానే ఓటమిపాలైంది. ఈ పర్యటనలో శ్రీలంక ఏ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మరీ ముఖ్యంగా ఆఖరి మ్యాచ్‌లో ఆ జట్టు 181 పరుగుల లక్ష్య ఛేదనలో 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో జయసూర్య ఇలా స్పందించాడు. మరోవైపు ఇలాగే ఆడితే ఈ ఏడాది చివర్లో జరిగే పొట్టి ప్రపంచకప్‌లోనూ మరిన్ని ఘోర పరాజయాలు చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశాడు.