A Man Killed His Wife And 3 Month Old Son In Hyderabad: రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను కిరాతకంగా నరికి చంపేశాడు. అంతేకాదు.. మూడు నెలల పసికందును సంపులో పడేసి హతమార్చాడు. కుమార్తెను కూడా చంపేందుకు ప్రయత్నించాడు కానీ, ఆలోపే ఆ చిన్నారి పారిపోయి తన ప్రాణాల్ని దక్కించుకుంది. మరోవైపు.. ఈ ఘోరానికి పాల్పడిన ఆ భర్త కంటికి కనిపించకుండా పారిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Pune: భార్యా, కొడుకును హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
నాలుగు సంవత్సరాల క్రితం.. బండరావిరాలకు చెందిన లావణ్య అనే మహిళకు అనాజ్‌పూర్‌కి చెందిన ధనరాజ్‌తో వివాహం జరిగింది. ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె, మూడు నెలల కుమారుడు ఉన్నారు. మొదట్లో వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది కానీ, ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ప్రతి చిన్న విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇలా గొడవ జరిగిన ప్రతీసారి లావణ్య తన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లడం, ధన్‌రాజ్ ఆమెను బుజ్జగించి తిరిగి ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. ఇటీవల వీరి మధ్య మళ్లీ గొడవ కావడంతో.. లావణ్య మరోసారి పుట్టింటికి వెళ్లింది.
Air Hostess Archana: వీడిన ఎయిర్‌హోస్టెస్ మృతి మిస్టరీ.. అతడే చంపేశాడు
బుధవారం మధ్యాహ్నం బాలింతగా ఉన్న లావణ్యను తన పుట్టింటి నుంచి ధన్‌రాజ్ తీసుకొచ్చాడు. ఇంటికొచ్చిన కాసేపటికే భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే అతడు గొడ్డలితో లావణ్యని నరికి చంపాడు. అనంతరం మూడు నెలల కుమారుడ్ని సంపులో వేసి చంపేశాడు. లావణ్య, ధన్‌రాజ్ గొడవ పడుతున్న సమయంలో.. వీరి కుమార్ ఆద్య ఇంటి నుంచి పారిపోయి, ప్రాణాలు దక్కించుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం.. పోలీసులు రంగంలోకి దిగారు. కుటుంబ కలహాలతోనే ధన్‌రాజ్ ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేల్చారు. పరారీలో ఉన్న ధన్‌రాజ్ కోసం గాలిస్తున్నారు.