నేడు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు సిద్ధమైంది. ఈ సీజన్ తొలిమ్యాచ్‌లోనే ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఈ మ్యాచ్‌లో ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ ఆటగాళ్ల ఆది నుంచి తడబడినట్లు కనిపించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుమీదున్న ఆర్సీబీ ఆటగాళ్లు చెలరేగారు. ఆలౌట్‌గా నిలిచిన కేకేఆర్ జట్టు బెంగళూరు ముందు 128 లక్ష్యాన్ని ఉంచింది. అయితే లక్ష్యచేధనకు దిగిన బెంగళూరు ఆటగాళ్లు ఆదినుంచే ఆదరగొట్టారు. ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ.. 3 వికెట్ల తేడాతో బెంగళూరు 132 పరుగులు తీసి విజయాన్ని సాధించింది.