Bangladesh: బంగ్లాదేశ్ పరిణామాలు, ఆ దేశ క్రికెట్ జట్టుపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బంగ్లా వ్యాప్తంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేస్తుండటంపై భారత్‌లో నిరసన వ్యక్తమవుతోంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కేకేఆర్ అతడిని వదులుకుంది. ఇదిలా ఉంటే, దీనిపై బంగ్లాదేశ్ మాజీ ప్లేయర్లు, అక్కడి ప్రభుత్వం హద్దులు మీరి భారత్‌ను విమర్శించాయి.
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. 2026 ఐపీఎల్ కోసం ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ.9.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై హింస తర్వాత ఐపీఎల్‌లో ముస్తాఫిజుర్ ఆడదాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలో నిరసనలు చెలరేగాయి. దాంతో ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని కేకేఆర్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించింది. బీసీసీఐ నిర్ణయంతో ముస్తాఫిజుర్ భారీ మొత్తంలో డబ్బు కోల్పోనున్నాడు.…
Mustafizur Rahman: కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి తీసేయడాన్ని భారత్‌లోని కొందరు రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ (BCCI) నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జేడీయూ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ.. రాజకీయాలను, క్రీడల్ని ముడిపెట్టొద్దని అన్నారు.
ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) భారీ ధరకు కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజూర్ రహ్మాన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 2025 డిసెంబర్ 16న అబూదాబీలో జరిగిన వేలంలో ముస్తాఫిజూర్‌ను రూ.9.20 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. అయితే వేలం ముగిసిన కొద్ది రోజులకే అంతా మారిపోయింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలు, హత్యల నేపథ్యంలో ముస్తాఫిజూర్ విషయంలో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా…
BJP Leader: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ మతోన్మాదులు దాడులుకు పాల్పడుతున్నారు. గత రెండు వారాల్లో ముగ్గురు హిందువుల్ని దారుణంగా చంపేశారు. అయితే, దీని ప్రభావం బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌పై పడుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఇటీవల వేలంలో బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను కొనుగోలు చేసింది.
Cameron Green Duck Out: ఐపీఎల్ 2026 వేలంలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ భారీ ధరకు అమ్ముడు పోయాడు. అతడిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడగా, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ.25.2 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి గ్రీన్‌ను దక్కించుకుంది.
అందరూ ఊహించిందే నిజమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌కు జాక్‌పాట్ తగిలింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడిని రూ.25.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దాంతో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డు నెలకొల్పాడు. గ్రీన్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు కాగా.. అతడి కోసం కేకేఆర్ సహా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. చివరకు అత్యధిక…
IPL 2026 Mini Auction: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం రేపు (డిసెంబర్ 16న) అబుదాబీలో జరగనుంది. వేలానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో, పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత బలపరిచేందుకు రెడీ అవుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న వేలం కోసం ఏకంగా 1,355 మంది ఆటగాళ్లు అధికారికంగా నమోదు చేసుకున్నారు. క్రిక్‌బజ్ ప్రకారం ఆటగాళ్ల జాబితా లిస్ట్ 13 పేజీలు ఉండడం విశేషం. ఓ మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్ రావడం ఇదే మొదటిసారి. రిజిస్ట్రేషన్ లిస్ట్‌లో 14 దేశాల నుంచి ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలంలో ప్రాంచైజీల మధ్య పోటీ బాగా ఉండనుంది. ఇందుకు కారణం…
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2026 వేలానికి అన్ని జట్ల ఫ్రాంఛైజీలు రెడీ అయ్యాయి. తమకు కావాల్సిన ప్లేయర్స్ ను అట్టిపెట్టుకున్న యాజమాన్యాలు.. భారం అనుకున్న వారిని వదిలించుకుంది.