R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!
- రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ప్రచారం
- రిటైర్మెంట్పై స్పందించిన మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్
- పక్కన పెట్టాలనుకుంటే ముందుగానే చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Ashwin Slams BCCI Over Rohit Sharma Retirement Buzz: స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై జరుగుతున్న ప్రచారంపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే.. హిట్‌మ్యాన్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందనే ఊహాగానాల మధ్య యాష్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో రోహిత్, విరాట్ కోహ్లీకి స్థానం ఉండదని బీసీసీఐ సెలెక్టర్లు భావించి ఉంటే.. ఆ విషయాన్ని ముందుగానే చెప్పాల్సిందని సూచించాడు. ఒకే ఒక్క చెత్త సిరీస్ ఆధారంగా సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తును నిర్ణయించడం సరైన విధానం కాదని అశ్విన్ పేర్కొన్నాడు.
తన యూట్యూబ్ ఛానెల్లో ఆర్ అశ్విన్ మాట్లాడుతూ… ‘సెప్టెంబర్, అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఆ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అనుభవం జట్టుకు ఎంతో అవసరం. యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మాట నిజమే. కానీ 2027 ప్రపంచ కప్ కోసం రోహిత్, విరాట్‌ను పక్కన పెట్టాలనుకుంటే.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే వారికి ఆ విషయాన్ని చెప్పాల్సింది. ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ చెబితే ఎలా?’ అని ప్రశ్నించాడు.
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
సీనియర్ ఆటగాళ్లతో నిజాయితీగా మాట్లాడటం చాలా ముఖ్యమని అశ్విన్ పేర్కొన్నాడు. ‘ఏ ఆటగాడికైనా ఇక ముందుకు వెళ్లాలనుకుంటున్నామని చెప్పడం బాధ కలిగిస్తుంది. కానీ స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం. ఆస్ట్రేలియా పర్యటనలో కోచ్ నాతో కూడా ఇలాగే మాట్లాడారు. జట్టు కొత్త దిశగా వెళ్లాలని భావిస్తున్నామని చెప్పారు. నేను ఆ నిర్ణయాన్ని అంగీకరించాను. ఒక చెత్త సిరీస్ ఏ ఆటగాడికైనా రావచ్చు. అలాంటి సమయంలో మద్దతు ఇవ్వాల్సిందే తప్ప వెంటనే తీర్పు ఇవ్వకూడదు’ అని చెప్పాడు.
ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్‌కు ఇంకా ఏడాది సమయం కూడా లేని వేళ ఈ రిటైర్మెంట్ చర్చలు ఎందుకు మొదలయ్యాయో తనకు అర్థం కావడం లేదని ఆర్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. ‘రోహిత్, విరాట్ ఇద్దరూ ఇప్పటికీ జట్టుకు కీలక ఆటగాళ్లే. మార్పు చేయాలనుకుంటే దానికి సరైన సమయం ఉండాలి. ప్రపంచ కప్‌కు 10-12 నెలల ముందు ఇలాంటి చర్చలు రావడం మంచి సంకేతం కాదు’ అని అన్నాడు. ఇదిలా ఉండగా రోహిత్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను బీసీసీఐ ఇప్పటికే ఖండించింది. లార్డ్స్ వన్డే అతడి చివరి మ్యాచ్ కాదని బోర్డు స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ అంశంపై చర్చలు కొనసాగుతుండగా.. అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!