Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై తీవ్ర విమర్శలు గుప్పించి, తన కుమారుడు యువరాజ్ కెరీర్ త్వరగా ముగియడానికి ధోనీనే కారణమని ఆరోపించిన యోగరాజ్ సింగ్.. ఇప్పుడు మాత్రం ధోనీనే అత్యుత్తమ భారతీయ కెప్టెన్‌గా అభివర్ణించారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌరవ్ యదువంశీ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న వీడియోలో, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో అత్యుత్తమ కెప్టెన్ ఎవరనే ప్రశ్న యోగరాజ్ సింగ్ ముందుంచారు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ యోగరాజ్ సింగ్ నాలుగు పేర్లలో ధోనీ వైపు మొగ్గు చూపారు.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
- Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ధోనీని ఎంచుకోవడానికి గల కారణాలను వివరిస్తూ.. ఆయన మైండ్‌సెట్ ఎప్పుడూ కూల్‌గా ఉంటుందని, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనూ ఆయన భయపడరని ప్రశంసించారు. ఆటగాళ్లను డీల్ చేసే విధానం ఎంతో పరిణతితో కూడుకుని ఉంటుందని, తాను చూసిన కెప్టెన్లలో ధోనీనే అత్యుత్తమమని కొనియాడారు. అయితే, అదే సమయంలో తన సహచరుడైన కపిల్ దేవ్ గురించి కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
తాము చిన్ననాటి నుంచి కలిసి ఆడామని, కపిల్ దేవ్ కేవలం రెండు సిరీస్‌లు ఓడిపోయినంత మాత్రాన ఆయనను కెప్టెన్సీ నుంచి తొలగించకుండా ఉండి ఉంటే, ఆయన కూడా చాలా కాలం పాటు సుదీర్ఘమైన, అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచేవారని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ధోనీనే బెస్ట్ కెప్టెన్‌గా ఎంచుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
భారత క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే ఈ నలుగురు దిగ్గజాలు జట్టును విజయవంతంగా నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ తొలిసారిగా 1983లో వన్డే ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఇక అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌గా నిలిచిన ఎంఎస్ ధోనీ.. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను సాధించిపెట్టి, ఐసీసీకి చెందిన మూడు ప్రధాన వైట్-బాల్ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు.
విరాట్ కోహ్లీ తన దూకుడుతో కూడిన నాయకత్వంతో భారత జట్టును టెస్టుల్లో నంబర్ వన్ స్థానానికి చేర్చడమే కాకుండా, విదేశీ గడ్డపై చరిత్రాత్మక విజయాలను అందించారు. మరోవైపు రోహిత్ శర్మ తన అద్భుతమైన వ్యూహాలతో భారత్‌ను 2024 టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలపడంతో పాటు అనేక మరుపురాని విజయాలను అందించారు. ఇలా నలుగురు కెప్టెన్లు భారత క్రికెట్‌కు అసమాన సేవలు అందించగా, యోగరాజ్ సింగ్ మాత్రం వారిలో ధోనీని బెస్ట్ కెప్టెన్‌గా ఎంచుకోవడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!