SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన శతకంతో చెలరేగాడు. డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్రీట్జ్కే 106 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 112 పరుగులు సాధించాడు. ఇది అతని వన్డే కెరీర్లో రెండో సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తో వన్డే క్రికెట్లో 14 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ రికార్డును బ్రీట్జ్కే తన పేరుపై లిఖించుకున్నాడు.
ఇప్పటివరకు 14 ఇన్నింగ్స్‌లాడిన అతడు మొత్తం 822 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆటగాడు ఇమామ్-ఉల్-హక్, భారత్ యువ సంచలనం శుభమన్ గిల్ సహా పలువురు దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టాడు. గతంలో ఇమామ్ 769 పరుగులు, గిల్ 674 పరుగులు మాత్రమే చేయగా, బ్రీట్జ్కే వారిని వెనక్కి నెట్టాడు. అంతేకాకుండా.. ఆస్ట్రేలియాపై వన్డేల్లో వరుసగా మూడో అర్ధశతకం లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన రెండో దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా హైన్రిచ్ క్లాసెన్ సరసన చోటు దక్కించుకున్నాడు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఆస్ట్రేలియాపై నంబర్ నాల్గో స్థానంలో సెంచరీ బాదిన ఐదవ ప్రొటిస్ ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. గతంలో ఎడెన్ మార్క్రమ్, ఫాఫ్ డుప్లెసిస్, రిలీ రోసో, ఏబీ డివిలియర్స్ ఈ ఘనత సాధించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా జట్టు ఆరంభంలోనే తక్కువ స్కోరుకే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు టోనీ డి జోర్జి, క్వింటన్ డి కాక్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బ్రీట్జ్కే కెప్టెన్ టెంబా బావుమా, రికెల్టన్, డేవిడ్ మిల్లర్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
ముఖ్యంగా మార్కో జాన్సెన్‌తో కలిసి ఆరో వికెట్‌కు 107 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. బ్రీట్జ్కే రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ప్రొటిస్ జట్టు 8 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేయగలిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌పై వన్డే అరంగేట్రం చేసిన బ్రీట్జ్కే, తన తొలి మ్యాచ్‌లోనే 150 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను చూపిన అద్భుత ఫామ్ దక్షిణాఫ్రికా జట్టుకు ఎంతో బలాన్ని ఇస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ సిరీస్‌లో బ్రీట్జ్కే ప్రదర్శన క్రికెట్ వర్గాల్లో విశేష చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..