సిడ్నీ వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్షాన్ని భారత్ 38.2 ఓవర్లలోఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. టీమిండియా విజయంలో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (121), విరాట్ కోహ్లీ (74)లు కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం కామెంటేటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, రవిశాస్త్రిలతో రో-కోలు మాట్లాడుతూ ఆస్ట్రేలియన్ క్రికెట్‌తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగం చెందారు. మరోసారి ఆస్ట్రేలియా…
Virat Kohli: ఆఫ్ఘనిస్తాన్ నేత, తాలిబాన్ ఉద్యమ నాయకుడు అనస్ హక్కానీ నుంచి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన అభ్యర్థన వచ్చింది. విద్య, క్రీడలు అంటేనే కోపగించుకునే తాలిబాన్లలో కూడా విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారని ఈ ఘటన రుజువు చేస్తోంది. అనాస్ హక్కానీ కూడా క్రికెట్‌కు, కోహ్లీకి అభిమాని. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్లపై హక్కానీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరు మే 2025లో రిటైర్మెంట్ ప్రకటించారు.
ప్రస్తుతం క్రికెట్ ఆడకున్నా.. టీమిండియా కెప్టెన్ ‘రోహిత్ శర్మ’ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. రిటైర్మెంట్ సంగతి అటుంచితే.. అత్యంత కఠినమైందిగా నిపుణులు పేర్కొన్న ‘బ్రాంకో’ ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అవుతాడా? అని మాజీలతో సహా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకున్న హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్ టెస్ట్ మీద అందరూ దృష్టిసారించడం ఇప్పుడు ఒకింత ఆశ్చర్యానికి గురిచేసేదే. అయితే అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ.. రోహిత్ బ్రాంకో టెస్టులో పాసయ్యాడు. ఇక తన…
Shubman Gill: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను 2–2తో సమం చేసిన అనంతరం టీమిండియాలో కెప్టెన్ మార్పుపై అప్పుడే చర్చ మొదలైంది. ముఖ్యంగా యువ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ చూపించిన సామర్థ్యం చూసిన తర్వాత, లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఓ కీలక సూచన చేశారు. గిల్‌ను భారత వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వన్డే జట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా దాదాపు…
Gautam Gambhir: భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆకస్మికంగా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లిన టీమిండియా జట్టును వదిలి భారత్‌కు తిరిగి వచ్చారు. జూన్ 20న ప్రారంభమయ్యే భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు ముందు, అతను స్వదేశం చేరుకోవడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే, తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం.. గంభీర్ తన తల్లి ఆరోగ్యం కారణంగా భారత్ కు చేరుకున్నాడు. అందిన సమాచారం మేరకు జూన్ 11న గంభీర్ తల్లి శీమా గంభీర్…
భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో భారత -ఏ జట్టు రెండు టెస్లు మ్యాచ్ ల అనధికారిక సిరీస్ ఆడుతుంది. ఈ పర్యటనలో తొలి మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు. నిలకడగా ఆడుతూ 116 పరుగులతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 26 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 17 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే ఈ సారి టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. ఈ సీనియర్ ఆటగాళ్లు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో సెలక్టర్లకు జట్టు కూర్పు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కెప్టెన్‌పై సెలెక్టర్లు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. సీనియర్లు లేని జట్టులో మరో ఇద్దరు సీనియర్లు జట్టుకు దూరం కానున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు మహ్మద్ షమీ దూరం అయ్యే అవకాశముంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నుంచి నేర్చుకున్న విషయాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని భారత వన్డే వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా టెస్టు క్రికెట్లో నువ్వు సాధించిన దానికి భారత్ కృతజ్ఞతతో ఉంటుందన్నాడు. ప్రతి ఒక్కరికీ నువ్వు స్ఫూర్తి అని గిల్ పేర్కొన్నాడు. తాజాగా రోహిత్ టెస్టు క్రికెట్ నుంచి రిటైరైన విషయం తెలిసిందే. జూన్‌లో ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం రోహిత్…
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు పెట్టాడు. టెస్ట్ ఫార్మాట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు తాను గర్వపడుతున్నానని, ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. టీ20, టెస్టు ఫార్మాట్లకు దూరమైన హిట్‌మ్యాన్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు. అయితే టీ20, వన్డేల్లో తనదైన ముద్ర వేసిన రోహిత్.. టెస్టుల్లో మాత్రం అంతగా రాణించలేదు. హిట్‌మ్యాన్ టెస్ట్ కెరీర్ అంతంత…