LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 1 నుంచి గృహ వినియోగదారుల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కొరకు బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి చేశారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారుల గ్యాస్ డెలివరీని నిలిపివేయరు. వారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డిజిటల్ ఛానెల్స్ ద్వారా దీనికి నమోదు చేసుకోవచ్చు. సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరపై 5 లేదా 10 కేజీల సిలిండర్లు పొందవచ్చు. డెలివరీ సమయంలో సిబ్బంది ద్వారా లేదా డిస్ట్రిబ్యూటర్ దుకాణానికి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. వినియోగదారులు తమ మొబైల్ యాప్స్ ద్వారా కూడా ఈ-కేవైసీ పూర్తి చేసే సదువు కల్పించారు.
ఇండేన్ కోసం ఇండేన్ ఆయిల్ వన్, భారత్ గ్యాస్ కోసం హలో బీపీసీఎల్, హెచ్‌పీ గ్యాస్ కోసం హెచ్‌పీ పే యాప్ ఉపయోగించాలి. ఈ ఆథెంటికేషన్ ప్రధాన ఉద్దేశం సబ్సిడీ సిలిండర్లు అర్హులైన కుటుంబాలకే అందేలా చూడటం. దీనివల్ల డూప్లికేట్, అనర్హమైన కనెక్షన్లను తొలగించవచ్చు. అంతేకాకుండా సబ్సిడీ సిలిండర్లను కమర్షియల్, పారిశ్రామిక అవసరాలకు మళ్లించకుండా అడ్డుకోవడంతో పాటు సబ్సిడీ పంపిణీలో పారదర్శకత పెరుగుతుంది.
Also Read
- Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
- Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
- TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
- SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
ఈ బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయడానికి ప్రభుత్వం మొదట జూన్ 30 గడువు విధించింది. వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ గడువును జూలై 31, ఆగస్టు 7, 15, 23, 31, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 14 వరకు పలుమార్లు పొడిగించారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 12 కోట్లకు పైగా ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాలను పంపాయి. గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి డెలివరీ సిబ్బంది ద్వారా నేరుగా సంప్రదించారు.
సెప్టెంబర్ 2026 నాటికి ప్రతి 14.2 కేజీల సిలిండర్‌పై సబ్సిడీ దాదాపు రూ. 210గా ఉంది. వినియోగదారులు సకాలంలో ఈ ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయడం ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా సిలిండర్లను పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఈ నూతన నిబంధనల వల్ల గ్యాస్ పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుంది.
తాజావార్తలు
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
-
Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!