Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్
- ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి
- క్లారిటీ ఇచ్చేసిన వాతావరణ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే కొందరు వర్షాలను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సృష్టించి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారు. బంగాళాఖాతంలో ‘సైక్లోన్ అర్నబ్’ ఏర్పడిందని.. తీరాన్ని తాకబోతుందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. నిజంగానే తూర్పు తీరాన్ని విధ్వంసకర తుఫాన్ తాకబోతుందా? లేదంటే అది కేవలం పుకారేనా? సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై వాతావరణ శాఖ క్లారిటీ ఇచ్చేసింది.
ప్రస్తుతం వాతావరణ శాఖ (IMD) అధికారిక రికార్డుల్లో ఎక్కడా కూడా ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో తుఫాన్ లేదు. బంగాళాఖాతంలో అలాంటి తుఫానే ఏర్పడ లేదు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ‘తీవ్ర అల్పపీడనం’ కొనసాగుతోంది. దీంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయి. ఇది తుఫాన్‌గా మార్పు చెందలేదు. తుఫానుగా ప్రకటించడానికి కఠినమైన శాస్త్రీయ ప్రమాణాలుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితులకు అలాంటి ప్రమాణాలు ఏమీ కనిపించలేదు. దీంతో ఐఎండీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే వాతావరణ శాఖ నిర్ధారించకుండానే సోషల్ మీడియాలో మాత్రం తుఫాన్ అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
‘అర్నబ్’ అనే పేరు ఎలా వచ్చింది?
వాస్తవానికి బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుఫానులకు పేర్లు పెట్టే 13 దేశాల ప్యానెల్ ఒకటి ఉంది. ఆ జాబితాలో తర్వాత పేరు బంగ్లాదేశ్ ప్రతిపాదించిన ‘అర్నబ్’ పేరు ఉంది. బెంగాలీలో దీనికి ‘సముద్రం’ అని అర్థం. నిజంగా తుఫానుగా బలపడినప్పుడు ఈ పేరు అమల్లోకి వస్తుంది. కానీ అదేమీ లేకుండానే ‘అర్నబ్’ తుఫాన్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తుఫాన్ లేకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాన్ని తేలిగ్గా తీసుకోవడానికి కూడా ఉండదు. తీవ్ర అల్పపీడనం భారీ తేమను తీసుకురావడంతో ఆంధ్రప్రదేశ్‌లో.. దక్షిణ ఒడిశాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నదులు పొంగి పొర్లుతున్నాయి. చెట్లు కూలిపోతున్నాయి. వరదలు ఏర్పడుతున్నాయి. ముందు జాగ్రత్తగా అధికారులు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తుఫాన్ వార్తలు కాకుండా.. అధికారికంగా వాతావరణ శాఖ తెలియజేసే వార్తలను విశ్వసిస్తే భయపడక్కర్లేదు.
- Tags
- Cyclone
- Cyclone Arnab
- IMD
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!