XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- AI అభివృద్ధిపై జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు
- ‘AI ఎప్పటికీ మానవ నియంత్రణలోనే ఉండాలి’ అన్న చైనా అధ్యక్షుడు
- AIని ప్రజల మేలు కోసం అభివృద్ధి చేయాలని పిలుపు
- ట్రంప్-జిన్‌పింగ్ భేటీలో AI కీలక అంశంగా చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
XI Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి జిన్‌పింగ్‌ను స్వాగతించారు. ఇద్దరు నేతలు వైట్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)గురించి చర్చంచారు. AI అభివృద్ధి ఎప్పటికీ మానవ నియంత్రణలోనే ఉండేలా అమెరికా, చైనా కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు.
‘‘AI మంచి కోసం అభివృద్ధి చేసి, నిర్వహించే సామర్థ్యం, బాధ్యత మనకు ఉంది. AI ఎల్లప్పుడూ మనిషి కంట్రోల్లోనే ఉండేలా చూడాలి’’ అని జిన్‌పింగ్ అన్నారు. ట్రంప్, జిన్‌పింగ్ భేటీలో ఏఐ అంశం కీలకంగా మారింది. రెండు దేశాలు ఏఐ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న తరుణంలో చైనా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాంకేతికత వల్ల తలెత్తే భద్రతా ప్రమాదాలపై పరస్పర చర్చ అవసరమని ఇద్దరు నేతలు భావించారు. జిన్‌పింగ్‌తో భేటీకి ముందు ట్రంప్ తన ట్రూత్‌సోషల్ వేదికగా ‘‘సూపర్ ఇంటెలిజెన్స్ (SI)’’ చర్చల్లో ప్రధానంగా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ గవర్నెన్స్ విషయంతో ప్రస్తుత విధానాన్ని మార్చకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read
చైనా, అమెరికా దేశాల పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ, విభేదాలను పక్కన పెట్టి ఉమ్మడి అంశాలను వెతుక్కోగలవని, రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోగలవని జిన్‌పింగ్ అన్నారు. చైనా-అమెరికా సహకారం ప్రపంచంలోని ప్రతీ సమస్యను పరిష్కరించకపోవచ్చు, కానీ మా సహకారం లేకుండా ప్రపంచంలోని అనేక సమస్యల్ని పరిష్కరించడం కష్టమని అన్నారు. అమెరికన్ పెట్టుబడిదారులకు చైనా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు.
ఇదిలా ఉంటే, ఈ వారంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, చైనా వసైస్ ప్రీమియర్ హీ లిఫెంగ్ మధ్య జరిగిన చర్చల్లో ఏఐ సంబంధిత ప్రమాదాలపై నోటిఫికేషన్ మెకానిజం ఏర్పాటు చేసే ప్రతిపాదనను అమెరికా ముందుంచింది. జాతీయ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఏఐ ఘటనపై ఇరు దేశాలు పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలనే విధానం ఇందులో ఉంది. అయితే దీనిపై రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు జరగలేదు.
#WATCH | Washington, DC: At the White House, Chinese President Xi Jinping says, "China and the United States are different in national conditions, but through candid, in-depth, and continued dialogue, our two countries can understand each other better, seek common ground while… pic.twitter.com/6WBtsklR4j
— ANI (@ANI) September 24, 2026
తాజావార్తలు
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
-
Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!