Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
- నెల్లూరు మేయర్ పదవిపై వైసీపీలో కొత్త గేమ్
- ఫ్యాన్ పార్టీ తరపున ప్రచారంలోకి ఏసీ సుబ్బారెడ్డి పేరు
- వివేకానందరెడ్డి పెద్ద కొడుకే ఆనం చెంచు సుబ్బారెడ్డి
- ఆనం వివేకాకున్న మంచి పేరు, సెంటిమెంట్ వర్కౌట్ అంటూ లెక్కలు
- తూచ్..అలాంటిదేం లేదంటున్న జిల్లా ముఖ్య నేతలు
- బీసీ లేదా మైనార్టీకి వైసీపీ అంటూ ఫీలర్స్
- మేయర్ అభ్యర్థిని వైసీపీ డిసైడ్ చేసేసిందంటూ మరో ప్రచారం
- ముందే ప్రకటిస్తే అధికార పక్షం నుంచి ఇబ్బందులన్న భయం?
- ఏసీ ప్రచారం టీడీపీని డైవర్ట్ చేయడానికా? సొంత పార్టీలోని వర్గపోరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: సింహపురి పాలిటిక్స్‌లో చిత్ర విచిత్రాలకు తెర లేస్తోంది. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవడం ఇక్కడ కొత్త కాకున్నా… ఇప్పుడో సరికొత్త గేమ్ ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీలో మొదలైన ప్రచారం సొంత పార్టీలో పైచేయి కోసమా? లేక ప్రత్యర్థిని గందరగోళంలోకి నెట్టడానికా అన్నది అర్ధంగాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట చాలామంది. పార్టీలోని వాళ్లే లీకులు ఇస్తారు, ఫైనల్‌గా అందరికీ చుట్టేస్తారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు నెల్లూరు మేయర్ పదవి కేంద్రంగా కొత్త గేమ్ స్టార్ట్ అయింది. కానీ… ఆటగాళ్లు ఎవరన్నది తేలకపోవడం ఇక్కడ విచిత్రం. పోస్ట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తూ… అన్ని పార్టీలు గట్టిగానే కసరత్తు చేస్తున్నాయి. ఆ క్రమంలోనే అధికార టీడీపీ తరపున రోజుకో పేరు ప్రచారంలోకి వస్తోంది. కానీ… వాటన్నిటికీ మించి వైసీపీ తరపున మేయర్ అభ్యర్థి ఇతనే అంటూ మొదలైన ప్రచారం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఫ్యాన్ తరపున ఆనం కుటుంబానికి చెందిన ఏసీ సుబ్బారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది.
నెల్లూరు రాజకీయాల్లో ఆనం వివేకానంద రెడ్డిది డిఫరెంట్ స్టైల్. ఆయన చనిపోయాక వారసులకి ఏ పార్టీలోనూ అంతగా ప్రాధాన్యం దక్కలేదు. వివేకానంద పెద్ద కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చిన్న కొడుకు రంగమయూర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అయితే… ఈసారి మేయర్ పదవికి డైరెక్ట్ ఎన్నికల కావడంతో వైసీపీ తరఫున ఏసీ సుబ్బారెడ్డి అలియాస్ ఆనం చెంచు సుబ్బారెడ్డి బరిలో దిగుతారని, దివంగత నేత వారసుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తారంటూ వైసీపీలోని ఓ వర్గం విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఆనం వివేకానందరెడ్డికి ఉన్న మంచి పేరు.. సెంటిమెంట్‌గా మారి.. పార్టీ గెలుపు తేలికవుతుందన్నది ఆ ప్రచారం సారాంశం. వైసీపీ అధిష్టానం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయని, రేపో మాపో అధికారిక ప్రకటన కూడా వచ్చేస్తుందంటూ హడావిడి చేస్తున్నారు కొందరు. కానీ… ఎక్కడో తేడా కొడుతోందనుకున్న మరో వర్గం దీనిపై క్లారిటీ ఇవ్వాలంటూ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్, రూరల్ ఇన్‌ఛార్జ్‌లతో పాటు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని సైతం కలిశారట. అయితే… పార్టీకి సంబంధం లేకుండా జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ పట్టించుకోవద్దని, అసలు ఇంతవరకు ఏసీ సుబ్బారెడ్డి తమను కానీ, అధిష్టానాన్ని కానీ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చేశారట.
Also Read
అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి బరిలో ఉంటారో.. మనం కూడా అదే సామాజిక వర్గం నేతను పోటీకి పెడతామని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. బీసీ లేదా మైనార్టీలకు మాత్రమే ఛాన్స్ ఉంటుందని కాస్త ఫీలర్ కూడా వదిలినట్టు తెలిసింది. కానీ… సుబ్బారెడ్డి విషయంలో ప్రచారం మాత్రం ఆగడంలేదు. ఇదే సమయంలో వైసీపీ తమ మేయర్ అభ్యర్థిని ఇప్పటికే డిసైడ్ చేసిందని, ఇప్పుడే బయట పెడితే అధికార పార్టీ నుంచి ఇబ్బందులు వస్తాయన్న అనుమానంతో రిజర్వేషన్ల ఖరారు తర్వాతే పేరు ప్రకటిస్తారన్న టాక్ సైతం నడుస్తోంది. దీంతో… ఫ్యాన్ పార్టీలో నడుస్తున్న ప్రచారం అధికార పార్టీని డైవర్ట్ చేయడానికా లేక సాంత పార్టీలోనే మరో వర్గాన్ని టార్గెట్ చేసుకునా అన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ నెలాఖరుకు రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 72 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు టీడీపీ నాయకులు. వైసీపీ మాత్రం ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.. రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాతే అభ్యర్థుల ఎంపిక తో పాటు.. మేయర్ అభ్యర్థిని కూడా ప్రకటించాలనుకుంటున్నారట. మొత్తంగా మేయర్ క్యాండిడేట్ విషయంలో అధికార, ప్రతిపక్షాలు ఎత్తులకు పైఎత్తులు చేస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
-
Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
-
AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!