Mumbai Indians Score In 10 Overs Innings: ఎమ్. చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ముంబైలో ఉన్న బ్యాటర్లు చూసి.. మైదానంలో పరుగుల వర్షం కురుస్తుందని ఊహిస్తే, అందుకు భిన్నంగా ముంబై జట్టు కుప్పకూలుతోంది. టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. మొదట ఓపెనర్లు నిదానంగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత జోరు పెంచాలని ప్రయత్నించారు కానీ, అది బెడిసికొట్టింది. ఇషాన్ కిషన్ కుదురుకున్నాడని భావించేలోపే.. అతడు 10 వ్యక్తిగత పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే మరీ దారుణంగా.. 10 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగుకే ఔట్ అయ్యాడు. అనంతరం 17.5 కోట్ల విలువైన కెమరాన్ గ్రీన్.. తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక ఫోర్ కొట్టి జోష్ నింపిన అతడు.. 5 వ్యక్తిగత పరుగులకే ఔటయ్యాడు.
SRH vs RR: రాజస్థాన్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన సన్‌రైజర్స్
అనంతరం సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కాసేపు వెంటనే వికెట్ పడనివ్వకుండా.. తమ జట్టుని ముందుకు నడిపించారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా, నిదానంగా తమ ఆటని కొనసాగించారు. ఇక వీళ్లిద్దరు క్రీజులో సెట్ అయ్యారని, వీరి జోడి సక్సెస్‌ఫుల్‌గా సాగుతుందని అనుకునేలోపే.. సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. షాట్ బాల్‌కి టెంప్ట్ అయ్యి కొట్టగా.. అది నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్లింది. దీంతో అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇలా ఓపెనర్లందరూ.. పెద్దగా సత్తా చాటకుండానే పెవిలియన్ చేరడంతో, ముంబై జట్టు 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 55 పరుగులే చేసింది. ఇది నిజంగా నిరాశాజనకమైన పెర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి. మరోవైపు.. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుండటం, అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తుండటం.. ఆ జట్టుకి శుభపరిణామమేనని చెప్పుకోవాలి.